ఫైనల్ గా అఫీషియల్ ఒరిజినల్ PRISMA యాప్ విడుదల అయ్యింది ఆండ్రాయిడ్ కు. అయితే జస్ట్ రెండు రోజుల క్రితమే సెపరేట్ గా prisma apk ఫైల్ ఒకటి తెలియజేశాము కానీ కొందరు పనిచేయటం లేదని తెలిపారు. సో ఇక అలాంటి సెపరేట్ apk ఫైల్స్ అవసరం లేదు. ఈ లింక్ వెళ్లి android PRISMA ఒరిజినల్ అప్లికేషన్ యాప్ ను ఇంస్టాల్ చేసుకోగలరు. అప్లికేషన్ సైజ్ సుమారు 7MB ఉంది. ఆండ్రాయిడ్ 4.1 నుండి అన్ని ఫోనుల్లో పనిచేస్తుంది. iOS users కు ఆల్రెడీ అందుబాటులో ఉంది. iOS లింక్. Prisma అనేది బాగా పాపులర్ అయిన ఫోటోస్ ఫిల్టర్స్ యాప్. అంటే మీరు అయినా ఇమేజ్ అయినా దానిని prisma యాప్ లో లోడ్ చేసి, క్రింద ఉండే ఫిల్టర్స్ ను ఒకొక్కటిగా సెలక్ట్ చేస్తే ఫోటో ఆర్ట్ గా మారుతుంది. అయితే ఇలా మారటానికి యాప్ time తీసుకుంటుంది. కానీ ఒకసారి వాడిన ఫిల్టర్ ను మరలా సెలక్ట్ చేసుకుంటే ఆల్రెడీ ముందు ముందు ఆ ఫిల్టర్ లోడ్ చేశారు కాబట్టి రెండవసారి లోడింగ్ time తీసుకోదు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడి ఈ ఆర్ట్ ఫిల్టర్లు పనిచేయటం జరుగుతుంది. ఫిల్టర్ intensity పెంచుకోవటానికి slider .కూడా ఉంటుంది.