గూగల్ కొత్త పిక్సెల్ లాంచర్ ఇంటర్నెట్ లీక్ అయ్యింది. ఆర్టికల్ లో డౌన్లోడ్ లింక్ పొందిపరిచాము

Updated on 15-Sep-2016

గూగల్ కు సొంతంగా Nexus ఫోనులు ఉండేవని మీకు తెలిసిన విషయమే. కాని లేటెస్ట్ కంపెని ఈ పేరును Pixel అనే పేరుతో మార్పులు చేసింది. అంటే ఇక నేక్సాస్ ఫోనులుండవు. పిక్సెల్ ఫోన్స్ ఉంటాయి.

ఇదే మార్పు కారణంగా పిక్సెల్ లాంచర్ పేరుతో కొన్ని మార్పులు చేసి కొత్త ఫోనుల్లో దీనిని తీసుకువస్తుంది. దీనికి కూడా ఇప్పటివరకూ గూగల్ నేక్సాస్ లాంచర్ అనే పేరు ఉండేది.

ఈ కొత్త ఫోనులను అక్టోబర్ 4 న రిలీజ్ చేస్తుంది అని అంచనా. అయితే పిక్సెల్ లాంచర్ apk ఫైల్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది. దీనిని పిక్సెల్ ఫోనులతోనే కాదు మీ ఆండ్రాయిడ్(ఏదైనా ఫర్వాలేదు) ఫోనుల్లో కూడా ఇంస్టాల్ చేసుకోగలరు.

ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు పిక్సెల్ లాంచర్ ను. By default గా మీరు ఇంస్టాల్ చేసిన వెంటనే ఐకాన్స్ అవి order గా ఉండకపోవచ్చు.కాని manual గా మీరు సెట్ చేసుకోగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :