PhonePe UPI: ఇక డెబిట్ కార్డ్ తో పనిలేదు.. ఆధార్ ఉంటే చాలు.!

Updated on 23-Feb-2023
HIGHLIGHTS

అతిపెద్ద ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ PhonePe ఇప్పుడు తన యూజర్లకు శుభవార్త అనౌన్స్ చేసింది. PhonePe UPI యాక్టివేషన్ కోసం ఇకనుండి డెబిట్ కార్డ్ అవసరం ఉండదని పనిలేదు మరియు మీ ఆధార్ ఉంటే చాలు అని తెలిపింది. దీనికోసం, ఆధార్ ఆధారిత OTP ప్రమాణీకరణను ఉపయోగించి UPI యాక్టివేషన్‌ చేసే ప్రక్రియను ఫోన్ పే ప్రారంభిచినట్లు పేర్కొంది. అంటే, మీ ఆధార్ కార్డ్ ను ఊపయోగించి చాలా సింపుల్ గా మరియు సురక్షితంగా PhonePe UPI ని స్టార్ట్ చేయవచ్చు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, PhonePe ఇప్పుడు ఆధార్ ఆధారిత UPI ఆన్ బోర్డింగ్ ఫ్లో ని అందిస్తున్న మొట్టమొదటి UPI తర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TRAP) గా  నిలిచింది. అంతేకాదు, ఇప్పుడు ఈ చర్య ద్వారా కోట్ల మంది భారతీయులు UPI ఎకో సిస్టం లో సజావుగా మరియు సురక్షితంగా భాగం కావడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.

వాస్తవానికి, UPI ఆన్‌బోర్డింగ్ విధానంలో ఇప్పటి వరకు డెబిట్ కార్డు తప్పనిసరి. UPI రిజిస్ట్రేషన్ ప్రక్రియలో UPI PIN ని సెట్ చేయడానికి వినియోగదారులకు చెల్లుబాటు అయ్యే డెబిట్ కార్డ్ తప్పనిసరి. అయితే, ఈ డెబిట్ కార్డ్స్ విధానం ద్వారా డెబిట్ కార్డ్ లేని చాలా మంది యూజర్లు ఈ సర్వీస్ దూరంగా వుంది.

ఈ ఎంపికను ఎంచుకునే వినియోగదారులు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను మొదలుపెట్టడానికి వారి ఆధార్ నంబర్‌లోని చివరి 6 అంకెలను మాత్రమే నమోదు చేయాలి. అతంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి యూజర్లు వారి UIDAI మరియు వారి సంబంధిత బ్యాంక్ నుండి OTPని అందుకుంటారు. ఆ తర్వాత, వినియోగదారులు PhonePe యాప్‌లో చెల్లింపులు మరియు బ్యాలెన్స్ చెక్‌ల వంటి అన్ని UPI ఫీచర్‌లను ఉపయోగించగలరు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :