పేటీఎం భారత్ లో తన పేమెంట్ బ్యాంక్ లాంచ్ చేసింది. దీని తరువాత పేటీఎం బ్యాంకు నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం ఎటువంటి చార్జెస్ వుండవు .ఇదే కాక దీనిలో ఎటువంటి మినిమమ్ బాలన్స్ ఉంచవలసిన అవసరం కూడా లేనే లేదు . ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్ ఫై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
దీనిలో యూజర్స్ కోసం వర్చువల్ డెబిట్ కార్డు సౌకర్యం కూడా కలదు. భారత్ లో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు మరియు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు కూడా అందుబాటులో కలవు. paytm ద్వారా యూజర్స్ కి ఏడాదికి 4% ఇంట్రెస్ట్ లభిస్తుంది.
డిపాజిట్లపై క్యాష్‌బ్యాక్ ఫెసిలిటీ కలదు. పేటీఎం. ఖాతాదారు పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుని అందులో రూ. 25వేలు జమ చేస్తే వారికి రూ. 250 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లాంటి ఆన్ లైన్ ట్రాన్సక్షన్ లు కూడా ఫ్రీ గా చేసుకోవచ్చని అన్నారు