Paytm ఇప్పుడు దాని అధికారిక మేసెజింగ్ సర్వీస్ ని ప్రారంభించింది. ఈ క్రొత్త ఫీచర్ కి కంపెనీ పే టీఎం ఇన్ బాక్స్ అని పేరు పెట్టింది. ఈ ఫీచర్ వినియోగదారులు ఒకరి తో ఒకరు చాట్ చెయ్యగల మెసేజింగ్ ప్లాట్ఫారమ్.జస్ట్ Whatsapp లానే వినియోగదారులు ఈ యాప్ లో కూడా ఫోటోలు, వీడియోలు, మెసేజెస్ మొదలైనవి షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ యొక్క అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే యూజర్లు సులభంగా డబ్బు పంపవచ్చు . మీరు దీని కోసం Paytm వాలెట్ ని ఉపయోగించాలి.Paytm యొక్క ఈ నూతన సర్వీస్ WhatsApp కు ఒక ప్రధాన ముప్పుగా ఉంటుంది.ఈ యాప్ పూర్తిగా ఎన్క్రిప్టెడ్ అని చెప్పారు. ఈ యాప్ వినియోగదారుల యొక్క ప్రైవసీ చూసుకుంటుంది . వినియోగదారులు కూడా ఈ యాప్ లో ప్రైవేట్ విషయాలు షేర్ చేయవచ్చు. అలాగే, ఈ అయాప్ లో గ్రూప్ చాట్లు చేయవచ్చు.ఈ యాప్ లో 'రీకాల్ మెసేజ్ ' యొక్క గొప్ప ఫీచర్ కూడా ఉంది, ఇది వినియోగదారులు తమ పొరపాటు ద్వారా పంపిన సందేశాలను తొలగించడానికి వీలు కల్పిస్తుంది. మెసేజింగ్ తో పాటు Paytm Inbox లో నోటిఫికేషన్ కూడా ఉంటుంది. దీని సహాయంతో, వినియోగదారులు ప్రతి క్యాష్ బ్యాక్ ఆఫర్ పై సమాచారాన్ని పొందగలుగుతారు. ఈ ఫీచర్ కారణంగా వినియోగదారులు Paytm యొక్క ఆకర్షణీయమైన డీల్స్ కోల్పోరు.