Paytm వినియోగదారులకు మంచి వార్త . Paytm పేమెంట్ బ్యాంక్లో ఖాతాలను కలిగి ఉన్న వినియోగదారులకు డెబిట్ కార్డులను కంపెనీ ప్రారంభించింది. వినియోగదారులు తమ డెబిట్ కార్డు కోసం Paytm App ద్వారా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డెబిట్ కార్డులతో పాటు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను PaytM అందించింది.
paytm పేమెంట్ బ్యాంకులో ఖాతాలను కలిగి ఉన్న వినియోగదారులకు డెబిట్ కార్డు జారీ చేయబడుతుంది. ఈ డెబిట్ కార్డు వినియోగదారుల కి తమ డిజిటల్ కార్డ్ నంబర్ పై మాత్రమే జారీ చేయబడతాయి . ఈ కార్డును ఉపయోగించి వినియోగదారులు ఏ atm నుంచయినా డబ్బు తీయవచ్చు . దీనితో పాటు, భారతదేశంలో ఏ దుకాణం నుండి అయినా కొనడానికి paytm డెబిట్ కార్డ్ ఉపయోగించవచ్చు.Paytm యొక్క డెబిట్ కార్డు వినియోగదారులకు ఉచితంగా లభించదు. ఈ కార్డు కోసం వినియోగదారుల నుండి 120 రూపాయలు ఛార్జ్ చేస్తోంది. అయితే, ఈ కార్డుతోపాటు అనేక ఆఫర్లను కంపెనీ అందిస్తోంది.