ఓపెరా బ్రౌజర్ కొత్త అప్ డేట్: యాడ్స్ ను బ్లాక్ చేసే ఫీచర్ యాడ్ అయ్యింది
Opera డెస్క్ టాప్ మరియు మొబైల్ బ్రౌజర్ లో ఎటువంటి extensions లేదా ప్లగ్ ఇన్స్ లేకుండా యాడ్స్ ను బ్లాక్ చేసే ఫీచర్ యాడ్ అయ్యింది. ఆల్రెడీ అప్ డేట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో available గా ఉంది.
యాడ్స్ అనేవి ఎక్కడ కనపడకుండా ఉండటం వలన ఇప్పుడు ఇంటర్నెట్ 40 శాతం ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అని చెబుతుంది కంపెని. అలాగే users కూడా 14% డేటా ను సేవ్ చేసుకోగలరు అంటుంది.
ఓపెరా మినీ లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేయటానికి 'O' మెను సింబల్ ను ఓపెన్ చేసి data-savings summary పై టాప్ చేయాలి. ఇక్కడ block ads అనే ఆప్షన్ కనపడుతుంది. దానిని ఆన్ చేయాలి.
డెస్క్ టాప్ users ఈ ఫీచర్ ను బ్రౌజర్ యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆన్ చేయగలరు. డెస్క్ టాప్ బ్రౌజర్ లో ఎన్ని యాడ్స్ బ్లాక్ అయ్యయో కూడా statistics చూపిస్తుంది.
ఇదే ఫంక్షన్ క్రోం బ్రౌజర్ లో థర్డ్ పార్టీ extension వంటివి ఇంస్టాల్ చేసుకోవటం ద్వారా పనిచేస్తుంది. కాని ఓపెరా ఈ ఫీచర్ ను బ్రౌజర్ లోనే యాడ్ చేసింది.
మొబైల్ లో కొత్త అప్ డేట్ లో Discover న్యూస్ ఫీడ్ redesigns కూడా జరిగాయి. డెస్క్ టాప్ లో విడియో పాప్ అవుట్ ఫీచర్ యాడ్ అయ్యింది.