opera మినీ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్ లో వీడియోస్ డౌన్లోడింగ్ ఫీచర్ రిలీజ్

Updated on 27-Jul-2016

Opera మినీ బ్రౌజర్ కు ఆండ్రాయిడ్ ప్లాట్ ఫారం పై కొత్తగా వీడియోస్ డౌన్లోడ్ చేసుకునే ఫీచర్ అఫీషియల్ గా యాడ్ అయ్యింది. ఈ వెర్షన్ నంబర్ 18.

ఇంకా ఇండియన్ users కు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఫీడ్ యాడ్ అయ్యింది బ్రౌజర్ homepage లో. ఈ సినిమా అప్ డేట్స్ బాలీవుడ్ హంగామా వెబ్ సైట్ నుండి వస్తాయి. 

అలాగే అందరికీ తెలిసిన లైవ్ క్రికెట్ అప్ డేట్స్ కూడా sportskeeda నుండి కనిపిస్తాయి. ఇక వీడియోస్ గురించి చెప్పాలంటే సోషల్ మీడియా మరియు ఇతర వెబ్ సైట్స్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోగలరు.

వీడియో పై క్లిక్ చేయగానే, save video అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై టాప్ చేస్తే వీడియో save అవుతుంది. cancel కూడా చేసుకొని లైవ్ స్ట్రీమింగ్ చేయగలరు.

అయితే బ్రౌజర్ స్వభావం కారణంగా ఆల్రెడీ opera బ్రౌజర్ లో వీడియోస్ డౌన్లోడ్ అయ్యేవి ఇంతకముందే. గతంలో opera లో వీడియో బూస్ట్ అండ్ యాడ్స్ బ్లాకింగ్ అనే ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా రిలీజ్ అయ్యాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :