వీడియో boost అనే కొత్త ఫీచర్ ను యాడ్ చేసిన ఓపెరా మిని బ్రౌజర్

వీడియో boost అనే కొత్త ఫీచర్ ను యాడ్ చేసిన ఓపెరా మిని బ్రౌజర్

Opera మిని బ్రౌజర్ ఆండ్రాయిడ్ లో కొత్తగా Video Boost అనే ఫీచర్ ను introduce చేసింది. ఇది వీడియో డేటా ను reduce చేసి, లోడింగ్ టైమ్ లో బఫరింగ్ ను తగ్గిస్తుంది.

అంటే మొబైల్ డేటా సేవింగ్ తో పాటు లోడింగ్ టైమ్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. users కు ఎన్ని వీడియోలు optimize చేసిందో ట్రాకింగ్ కౌంట్ కూడా చూపిస్తుంది.

O ఐకాన్ మెను(opera మిని 15 వెర్షన్) లోకి వెళ్లి సేవింగ్స్ summary పై క్లిక్ చేస్తే high సేవింగ్స్ మోడ్ లోకి వెళ్తారు. ఇప్పుడు క్రింద వీడియో boost ఆప్షన్ లో బాక్స్ ను టిక్ చేస్తే వీడియో స్మూత్ వ్యూయింగ్ పనిచేస్తుంది.

ఈ అప్ డేట్ లో ఉన్న మరిన్ని ఫీచర్స్..
1. ఆటోమేటిక్ గా డేటా కంప్రెషన్ ఆఫ్ చేస్తుంది మీరు wifi లో ఉంటే. అయితే మీరు పబ్లిక్ వైఫై లో ఉంటే స్పీడ్ తగ్గుతుంది కాబట్టి సేవింగ్స్ మోడ్ ఆన్ చేసుకోవచ్చి మళ్ళీ.

2. బ్రౌజర్ నుండి అప్ లోడ్ చేసిన హై రిసల్యుషణ్ ఇమేజెస్ reduced రిసల్యుషణ్ తో అప్ లోడ్ అవుతాయి. ఫర్ eg: 2240×1680 సైజ్ లో ఉన్నవి 800×600 pixels కు resize చేసి సైజ్ తగ్గించి అప్ లోడ్ ఫెయిల్ అవటం వంటివి తగ్గిస్తుంది బ్రౌజర్.

3. లాంగ్ ఆర్టికల్స్ లేదా వెబ్ పేజెస్ లో ఉంటే క్రిందకు స్క్రోల్ చేసినప్పుడు thumbscroller ఫీచర్ తో side స్క్రోల్ bar ను కనిపించేలా చేసుకోగలరు స్క్రీన్ పై.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo