Opera రెండు ఆండ్రాయిడ్ యాప్స్ కు వీడియో కంప్రెషన్ మరియు ఇతర అప్ డేట్స్

Updated on 04-Nov-2015

ఓపెరా బ్రౌజర్ రీసెంట్ గా డెస్క్ టాప్ కు ఒపేరా 33 కొత్త అప్ డేట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఓపెరా బ్రౌజర్ మరియు ఓపెరా బ్రౌజర్ మిని ఫర్ ఆండ్రాయిడ్ వేరియంట్ యాప్స్ కు కూడా అప్ డేట్స్ ఇచ్చింది.

ప్రధానంగా ఈ అప్ డేట్ లో చెప్పుకోదగినది వీడియో కంప్రెషన్ ఫీచర్. ఆన్ లైన్ లో చూడగలిగే వీడియో లను ఇప్పుడు తక్కువ డేటా తో చూడవచ్చు. కొత్త అప్ డేట్ తో 3.38Mb సైజ్ ఉంది యాప్.

బ్రౌసర్ సెట్టింగ్స్ లో కి వెళ్తే, డేటా సేవింగ్స్ ఆప్షన్ లో వీడియో కంప్రెషన్ బాక్స్ ఉంటుంది. దానిని టిక్ చేస్తే ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. దీనితో పాటు మిగిలిన చిన్న చిన్న ఇంప్రూవ్ మెంట్స్ కూడా యాడ్ అయ్యాయి.

ఫేస్ బుక్ నోటిఫికేషన్స్ కొన్ని మార్పులు చేయబడ్డాయి. నోటిఫికేషన్స్ లో ప్రొఫైల్ పిక్చర్ కూడా కనిపిస్తుంది. అలాగే డౌన్లోడ్స్ అయిపోతే బ్రౌసర్ నోటిఫికేషన్ కూడా ఇస్తుంది.

Wait for WiFi, కాంటెక్స్ట్ మెను లుక్స్, కొత్త ఓపెరా ఐకాన్ ఈ అప్ డేట్ లో వచ్చాయి. ప్రస్తుతానికి కొంతమందికి కేవలం ఓపెరా బ్రౌజర్ మిని ఫర్ ఆండ్రాయిడ్ యాప్ మాత్రమే అప్ డేట్ వస్తుంది.

టిప్స్ – ఓపెరా బ్రౌజర్ అనేది కేవలం ఇంటర్నెట్ ను బ్రౌజ్(ఫేస్ బుక్, ట్విటర్) చేయటానికి బాగా ఉపయోగపడుతుంది(speed). డౌన్లోడ్స్, ఫార్మ్స్ ఫిల్లింగ్ వంటివి చేయటానికి గూగల్ క్రోమ్ బ్రౌజర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :