ఇక ల్యాండ్ లైన్ నంబరుతో కూడా WhatsApp వాడొచ్చు

ఇక ల్యాండ్ లైన్ నంబరుతో కూడా WhatsApp వాడొచ్చు

గతకొద్దికాలంగా, WhatsApp లో అనేక క్రొత్త ఫీచర్లు జోడించబడుతున్నాయి, మరియు ఈ ఆప్ పైన ప్రజాదరణ మరింతగా పెరుగుతోంది. ప్రస్తుతం వాట్స్ ఆప్ కి  సుమారు 1.5 బిలియన్ గ్లోబల్ యూజర్లు ఉన్నారు. ఈ ఇన్స్టాంట్  మెసేజి ఆప్ తో వాయిస్ కాల్ మరియు వీడియో కాళ్ళను ఉచితంగా చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీరు వేలిముద్ర అతంటికేషన్, డార్క్ మోడ్ అలాగే, వేరెవరైనా అడ్మిన్ ఇకపై మీ అనుమతి లేకుండా ఏటువంటి గ్రూపుకు మిమ్మల్ని జోడించే విలేకుండా చేసే ఫీచర్ కూడా త్వరలోనే రానుంది.

ఇప్పుడు మీరు జియో ఫోన్ మరియు నోకియా 8110 వంటి ఫీచర్ ఫోన్లో కూడా దీన్ని అమలు చేయవచ్చు. అదేవిధంగా, మీరు ఇప్పుడు మీ మొబైల్ నంబర్ మాత్రమే కాకుండా ల్యాండ్లైన్ నంబర్ నుండి కూడా WhatsApp ను అమలు చేయవచ్చు. నమ్మకంగా లేదా,  ఇది నిజం ఈ రోజు మేము ఈ విషయం గురించి మీకు తెలియజేస్తాము.

1. వాట్స్ ఆప్ ల్యాండ్ లైన్ ద్వారా పొందడానికి ఈ దశలను అనుసరించండి

 2. మీ ఫోన్ ఒక సాధారణ Whatsapp కలిగి ఉండాలి. దీని కోసం, మీరు రెగ్యులర్ లేదా బిజినెస్ WhatsApp డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయాలి.

3. Whatsapp ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, మీరు దీన్ని మీ మొబైల్ ఫోన్, టాబ్లెట్, లాప్టాప్ మరియు WhatsApp వంటి అనుకూల డివైజెస్ లో వాడుకోగలరు.

4. ఈ ఆప్ ఓపెన్ చేసిన తర్వాత, మీరు మీ నేషన్  కోడ్ను నమోదు చేయవలసి ఉంటుంది, దీని తరువాత, మీ 10 అంకెల మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. 

5. ఇక్కడ మీ మొబైల్ నంబరును నమోదు చేయడానికి బదులుగా, మీ ల్యాండ్ లైన్ నంబర్ను ఎంటర్ చెయ్యండి, ఇది మీ WhatsApp ఖాతాను అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.

6. ఇప్పుడు మీ నంబర్ కాల్ లేదా SMS కోసం ఉపయోగించబడే వెరిఫికేషన్ కోసం వెళ్తుంది. మీ ల్యాండ్లైన్ నంబర్ నుండి WhatsApp ను అమలు చేయడానికి, మీరు   "Call Me" ఎంపికను               పొందుతారు, తర్వాత మీరు ధృవీకరణ వెరిఫికేషన్ ప్రాసెస్ కొనసాగవచ్చు.

7. ఇప్పుడు మీరు కాల్ ఎంపికను ఎంచుకున్నప్పుడు, మీ ల్యాండ్ లైన్ నంబరుకు ఒక కాల్ అందుతుంది మరియు ఆ కాల్ లో  మీకు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ ఇవ్వబడుతుంది.

8. మీరు ఈ వెరిఫికేషన్ కోడుని వాట్స్ ఆప్ లో నమోదు చేసిన వెంటనే, మీరు ప్రొఫైల్ క్రేయేషన్ దశల ప్రక్రియకు వెళతారు మరియు మీరు సులభంగా ప్రొఫైల్ ఫోటో, పేరు మరియు ఇతర విషయాలను నమోదు చేయడం ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo