ఇక యూట్యూబ్ మ్యూజిక్ ఆప్ ఫోన్లో స్టోర్ చేసిన మ్యూజిక్ ని కూడా ప్లే చేస్తుంది.
ఈ యూట్యూబ్ మ్యూజిక్ ఆప్ మీ లోకల్ స్టోరేజిలోని మ్యూజిక్ ట్రాక్స్ ని కూడా ప్లే చేసేలా అప్డేట్ చెయ్యబడింది.
ఇటీవలే, యూట్యూబ్ మ్యూజిక్ ఆప్ ఇండియాలో ఆవిష్కరించబడింది మరియు మంచి అధరణను కూడా పొందింది. సహజంగానే, అందరికి పరిచయమున్న యూట్యూబ్ యొక్క మరొక వెర్షన్ కావడంతో అందరికి చేరువయ్యింది. ఈ ఆప్ ఇప్పటివరకు 100 మిలియన్, అంటే 10 కోట్ల సార్లు డౌన్లోడ్ చేయబడిందంటే ఎంతగా ఇది ప్రజల మనసు దోచుకుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇందులో ఒక చిన్న లోపం, వినియోగదారులకి కొంచం ఇబ్బంది కలిగించేలా అనిపించింది.
అదేమిటంటే, ఈ ఆప్ ద్వారా యూట్యూబ్ లోని అన్ని వీడియోలను ఆడియోలను మంచి క్వాలిటీతో అందుకునే అవకాశం అందిస్తుంది. కానీ, ఫోనులో ముందునుండే లేదా డౌన్లోడ్ చేసుకున్న లోకల్ స్టోరేజిలోని మ్యూజిక్ ఫైళ్లను వినడానికి, మరొక ఆప్ లేదా ఫోన్లోని ఫీచర్ పైన ఆధారపడాల్సి వస్తుంది. అంటే, మన ఫోన్లో డౌన్లోడ్ లేదా స్టోరేజీ చేసిన మ్యూజిక్ ట్రాక్స్ వినాలంటే, యూట్యూబ్ మ్యూజిక్ ఆప్ మూసేసి, వేరొక ఆప్షన్ కోసం వెతుక్కోవాలి.
అయితే, ఇప్పుడు ఈ సమస్యని సరిచేసింది మరియు పూర్తిగా కొత్తదనంతో అందించింది. కొత్తగా విడుదల చేసినటువంటి, 3.03 వెర్షన్ అప్డేటుతో ఈ సౌలభయం మనకు అందుతుంది. ఈ అప్డేట్ అందుకున్నవారు యూట్యూబ్ మ్యూజిక్ ఆప్ నుండి ఆన్లైన్ మ్యూజిక్ తో పాటుగా మన ఫోన్లోని లోకల్ స్టోరేజి మ్యూజిక్ ని కూడా ప్లే చెయ్యవచ్చు. ఈ ఆప్ గూగుల్ ప్లే మ్యూజిక్ ఆప్ వలెనే, FLAC, MP3, ogg, WAV వంటి మేజర్ ఫైల్స్ ని ప్లే చేయగలదు.