జియో టెలికాం సంస్థ, ఇప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ, మరింతగా విస్తరిస్తోంది. కొన్ని నెలల క్రితం, రిలయన్స్ జియో తన జియోఫైబర్ FTTH సేవను వినియోగదారుల కోసం ప్రారంభించింది. రిలయన్స్ జియో వినియోగదారుల కోసం, ఇప్పుడు జియో UPI సర్వీస్ కూడా తీసుకొచ్చింది. రిలయన్స్ జియో యూజర్ల కోసం జియోమనీ యాప్ కలిగి ఉన్నప్పటికీ, ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే, ఇది గతంలో UPI తో మాత్రం జతచేయబడలేదు. కానీ, ఇప్పుడు రిలయన్స్ జియో తన జియోమనీ యాప్ లో UPI ఫీచర్ ను ప్రవేశపెట్టిందని, ఇది చందాదారులకు UPI లావాదేవీలు చేయడం చాలా సులభం తరం చేసింది.
UPI ఆధారిత చెల్లింపు సేవను ప్రారంభించాలనే జియో యొక్క ప్లాన్, ఇంతకుముందు చాలాసార్లు చర్చించబడింది. కాని ఇప్పుడు ఎట్టకేలకు జియో తన వినియోగదారులకు పరిమిత మార్గంలో UPI ఆధారిత సేవలను అందించడం ప్రారంభించిందని ఎంట్రాకర్ ధృవీకరించారు. . దీని అర్థం కొద్దిమంది చందాదారులు మాత్రమే దీన్ని మొదట అందుకుంటారు. తరువాత క్రమంగా, ఇది ఇతర వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. రిలయన్స్ జియో, UPI ని తన చెల్లింపు వేదికపై ప్రవేశపెట్టడం ద్వారా, UPI తో ముందుకు వచ్చిన పరిశ్రమలో మొట్టమొదటి టెలికాం ఆపరేటర్ మరియు UPI ని వినియోగదారులకు తీసుకువచ్చిన రెండవ పేమెంట్ బ్యాంక్ అవుతుంది.
వాట్సాప్ వంటి ఇతర కంపెనీలు కూడా UPI చెల్లింపులను నియంత్రించే రెగ్యులేటరీ అథారిటీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) తో చర్చలు జరుపుతున్నాయి. అయినప్పటికీ, పేమెంట్ సర్వీస్ యొక్క వాట్సాప్ వినియోగదారుల డేటాను స్టోర్ చేస్తుందేమో అనే ఆందోళన కారణంగా ఎన్‌పిసిఐ నుండి చివరి నోడ్ ను వాట్సాప్ పొందలేకపోయింది.
రిలయన్స్ జియో యొక్క UPI సర్వీస్ యొక్క గొప్పదనం ఏమిటంటే, ఈ సర్వీస్ మైజియో అప్లికేషన్ లో విలీనం చేయబడింది. అంటే చెల్లింపులు చేయడానికి UPI ని ఉపయోగించాలనుకునే జియో వినియోగదారులు ఎటువంటి ప్రత్యేక App డౌన్ లోడ్ చేయనవసరం లేదు. జియో ఇతర యాప్స్ కోసం కూడా ఇదే విధమైన పని చేసింది, దీనిలో, వినియోగదారులు మైజియో యాప్ లో జియో సావన్ ఇంటిగ్రేషన్ ఉపయోగించి పాటలను వినవచ్చు. జియో సినిమా ఇంటిగ్రేషన్ ఉపయోగించి మైజియో యాప్ లో సినిమాలు చూడవచ్చు. ఇక్కడ, మీరు ఇతర UPI యాప్స్ మాదిరిగానే రిలయన్స్ జియో ద్వారా UPI సౌకర్యాన్ని కూడా పొందుతారు.
మైయో అప్లికేషన్‌లో జియో యూజర్లు UPI సర్వీస్ కోసం రిజిష్టర్ చేసిన తరువాత, వారికి వర్చువల్ పేమెంట్ చిరునామా (VPI) లభిస్తుంది. అది @ జియో సఫిక్స్ తో పొందుపరచబడుతుంది. అంటే UPI చెల్లింపులను మార్గనిర్దేశం చేయడానికి జియో తన చెల్లింపుల బ్యాంకును ఉపయోగిస్తుంది. జియో యొక్క యుపిఐ సేవ కోసం సైన్ అప్ చేయడానికి, మీరు మీ మొబైల్ నంబరును నిర్దిష్ట ఖాతాకు లింక్ చేయాలి, ఆపై మీరు సాధారణ యుపిఐ ఖాతా రిజిస్ట్రేషన్ విషయంలో మీ డెబిట్ కార్డు యొక్క చివరి ఆరు అంకెలను నమోదు చేయాలి. తరువాత, మీరు ఈ ప్రత్యేకమైన VPA కోసం UPI పిన్ను సెట్ చేయాలి.