వాట్స్ అప్ లో వచ్చే యాడ్స్ ను ఇక వాట్స్ అప్ లోనే కంప్లైంట్ చేయగలరు
Advertising Standards Council ఆఫ్ ఇండియా – ASCI కు ఇప్పుడు మీరు వాట్స్ అప్ లో ఫార్వర్డ్ అయ్యే objectional కంటెంట్ పై కంప్లైంట్ చేయగలరు.
ఇందుకు ASCI users కు నంబర్ కుడా ఇచ్చింది. మీకు ఎటువంటి misleading యాడ్స్ వచ్చినా వాట్స్ అప్ లో +91 7710012345 అనే వాట్స్ అప్ నంబర్ కు images రూపంలో send చేయవచ్చు.
అవి ప్రింట్ యాడ్స్ అయినా, వెబ్ సైట్ లింక్స్ అయినా, యూట్యూబ్ వీడియోస్ లింక్స్ అయినా, హార్డింగ్స్ అయినా సరే ASCI టీమ్ valid కాదా లేదా అని చూసి suo moto కంప్లైంట్స్ ను రిజిస్టర్ చేస్తుంది.
అంటే వాస్తవంలో లేనటువంటి విషయాలను యాడ్స్ లో చెప్పి users ను ఆకర్షించే వాటికీ ఇది బాగా వర్తిస్తుంది. గతంలో కూడా ఎయిర్టెల్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ యాడ్ పై ASCI కంప్లైంట్స్ తీసుకుంది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile