Spotify App ఇప్పుడు ఇండియాలో విడుదల, అదరగొడుతున్నమ్యూజిక్ ఆప్
ఈ మ్యూజిక్ ఆప్ తో ఉచితంగా పాటలు వినవచ్చు మరియు ప్రీమియం నెలకు రూ.119 రుపాయలతో ప్రారంభం.
Spotify App ఇప్పుడు వెబ్ ఆప్, డెస్క్ టాప్ ఆప్, ఆండ్రాయిడ్ మరియు iOS కోసం అందించడింది. ముందుగా, ఆండ్రాయిడ్ ఆప్ స్టోర్ లో డిసేబుల్ చేయబడిన ఆప్ ఇప్పుడు live చేయబడింది. దీనితో, పాటుగా iTunes App కూడా ఇప్పుడు live చేయబడింది. వినియోగదారులు ఎటువంటి VPN (వెరిఫికేషన్ పిన్ నంబర్) అవసరం లేకుండానే చాల సులభంగా దీనికి Sign-Up అవ్వవచ్చు. అంటే, facebook లేదా ఈమెయిలు వంటి గొడవలేకుండానే మీరు దీనికి Sign-Up అవ్వవచ్చు.
దీనితో మంచి క్వాలిటీతో ఆడియోని ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో ఒక సారి Sign-Up అయిన తరువాత మీరు ఉచితంగా ఈ సర్వీసును పొందవచ్చు, లేదా మరిన్ని ఇతర ఫిచర్లను పొందాలనుకుంటే, ప్రీమియం కు అప్డేట్ అవ్వవచ్చు. ప్రీమియం అప్డేట్ చేసుకోవడానికి, ఒకరోజు నుండి మొదలు కొని సంవత్సరం వరకు అనేక ప్లాన్స్ అందించింది. ఒకరోజుకు గాను 13 రూపాయలు చల్లించాల్సి ఉంటుంది, ఇక వారానికి అంటే,7 రోజులకు గాను 39 రూపాయలను చెల్లించవల్సి ఉంటుంది.
ఇక ఈ మ్యూజిక్ ఆప్ గురించి చూస్తే, ఇందులో కావాల్సిన భాషను మరియు నచ్చిన సింగర్ ని ఎంచుకోవచ్చు. అలాగే, మంచి ఎక్వలైజెర్ సెటింగులతో పాటుగా ఎన్నో ఎంపికలు మీకు అందుబాటులో ఉంచింది. ఇక ప్రీమియం విషయానికి వస్తే, ఒక 30 రోజుల ఉచిత ట్రయిల్ అందిస్తోంది ఈ ఆప్, కాబట్టి దీన్ని ప్రీమియం అప్డేట్ ని 30 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. ప్రీమియం కోసం మారడం ద్వారా 3 రేట్లు క్వాలిటీ గల మ్యూజిక్ తో పాటుగా ఎటువంటి యాడ్స్ మిమ్మల్ని మీకు మీజిక్ మధ్యలో బాధించవు. అలాగే, మీకు నచ్చిన సాంగ్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.