ఫేస్ బుక్ నోటిఫికేషన్స్ ఇక నుండి గూగల్ క్రోమ్ బ్రౌజర్ లో..
ఫేస్ బుక్ అప్లికేషన్ లేకపోయినా నోటిఫికేషన్స్ వస్తాయి.
సోషల్ నెట్వర్క్ దిగ్గజం, ఫేస్ బుక్ కొత్త ఫీచర్ ను బయటకు విడుదల చేసింది. ఇది ఫేస్ బుక్ లో మీకు వచ్చే నోటిఫికేషన్లను డైరెక్ట్ గా మీ మోబైల్ క్రోమ్ బ్రౌజర్ కు పంపిస్తుంది.
మీ వద్ద ఫేస్ బుక్ అప్లికేషన్ లేకపోయినా, క్రోమ్ లో నోటిఫికేషన్లు చూడవచ్చు. క్రోమ్ పుష్ API ను ఆధారంగా పనిచేస్తుంది. అయితే ఇది డిఫాల్ట్ గా on లో లేదు. మీరు manual గా సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి.
ఎలా చేయాలి?
1. మీ మొబైల్ లో గూగల్ క్రోమ్ బ్రౌజర్ ను ఇంస్టాల్ చేసుకోండి. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి, ఫేస్బుక్ లో కి సైన్ in అవ్వాలి.
2. మీ అకౌంట్ లోకి లాగ్ in అయితే, బ్రౌజర్ ఆటోమేటిక్ గా "నోటిఫికేషన్ ఫీచర్ ను enable చేయాలా?" అని ఒక పాప్ అప్ మెసేజ్ చూపిస్తుంది.
3. మీరు అక్కడ enable చేస్తే చాలు, ఇక నుండి మీరు fb పేజ్ క్లోజ్ చేసినా సరే నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక వేల వద్దు అనుకుంటే క్రోమ్ సెట్టింగ్స్ లోకి వెళ్లి డిసేబుల్ చేయగలరు.
దీనిలో అంత ఉపయోగం ఏముంది?
ఫేస్ బుక్ అప్లికేషన్ ఇంస్టాల్ చేసుకుంటే, చాలా ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది యాప్. దానికి తోడూ ర్యామ్ కు నిరంతరం తీసుకుంటుంది. ఈ రెండూ వాడటం వలన బ్యాటరీ కూడా ఎక్కువ తీసుకుంటుంది.
అలా గని ఫేస్ బుక్ యాప్ లేకుంటే ఏలా..? నోటిఫికేషన్స్, మెసేజెస్ అన్నీ వచ్చినవెంటనే మనకు తెలియాలి కదా!! సో ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ తక్కువ ఉన్న స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు ఇది ఉపయోగపడుతుంది.
అంతే కాదు, 2g ఇంటర్నెట్ స్పీడ్ కనెక్షన్ లో ఉన్న వారికీ యాప్ కన్నా బ్రౌజర్ లోనే ఫేస్ బుక్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఇదే పని UC మొబైల్ బ్రౌజర్ లో కూడా పొందగలరు. పుష్ నోటిఫికేషన్స్ ఇవ్వటం ఎప్పుడో స్టార్ట్ చేసింది UC బ్రౌజర్.