PUBG MOBILE లో చీటింగ్ లేదా హ్యాకింగ్ చేస్తే ఇక 10 సంవత్సరాలు బ్యాన్
PUBG MOBILE నుండి మీరు చికెన్ డిన్నర్ గెలవడానికి చీటింగ్ లేదా హ్యాకింగ్ వంటివి ఉపయోగిస్తుంటే, ఇక పనైపోయినట్లే. ఎందుకంటే, మీ కోసం ఇప్పుడు ఒక కొత్త చెడ్డ వార్త ప్రకటించింది. మోసం చేసిన ఆటగాళ్లకు 10 సంవత్సరాల నిషేధం విధించడం ద్వారా ఈ గేమింగ్‌లో ఫెయిర్ ప్లే కోసం PUBG MOBILE ఒక వైఖరిని తీసుకుంది.
ఈ సందర్భంగా, PUBG MOBILE ఇలా చెబుతోంది, “ప్రతి ఆటగాడికి సరసమైన మరియు ఆనందించే గేమింగ్ వాతావరణాన్ని అందించడానికి మరియు ఇతరులు చేసే మోసాన్ని అరికట్టడానికి, మేము ఎల్లప్పుడూ కృషి చేసాము. మేము ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణిస్తాము; అందువల్ల, ఉల్లంఘించిన ప్రతి ఖాతాకు 10 సంవత్సరాల నిషేధం విధించబడుతుంది.”PUBG లో ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది మోసగాళ్ళు మాత్రమే వున్నారనుకుంటే పొరబాటే, కేవలం ఈ సెప్టెంబరులో మాత్రమే 3500 మంది ఆటగాళ్లకు 10 సంవత్సరాల నిషేధాన్ని కంపెనీ జారీ చేసింది.
అన్యాయమైన ప్రయోజనాన్ని పొందే అనధికార తర్డ్ పార్టీ యాప్స్ లేదా హ్యాకింగ్ లను ఉపయోగించే ఆటగాళ్ళు ఈ నిషేధంతో ఖండించబడతారు. మోసం చేసినట్లు అనుమానించబడిన ఇతర ఆటగాళ్లను నివేదించే అవకాశం కూడా ఆటగాళ్లకు ఉంది. ఇన్-గేమ్ రిపోర్టింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి ఇది చేయవచ్చు. మీరు నిషేధించబడిన ఆటగాళ్ల జాబితాను మరియు వారిని ఇక్కడ ఎందుకు నిషేధించారో చూడవచ్చు.
ఇక మరిన్ని PUBG వార్తల విషయానికి వస్తే, PUBG మొబైల్ లైట్ ఇటీవల వెర్షన్ 0.14.1 తో అప్డేట్ చెయ్యబడింది. ఈ అప్డేట్ తో కొత్త ఆర్కేడ్ మోడ్‌ను తెస్తుంది. ఇది ఒక ప్రత్యేక WAR మోడ్ ను తెచ్చింది, దీనితో ఆటగాళ్ళు RPG-7 తో గేమ్ ఆడవచ్చు. ఈ అప్డేట్ లో కొత్త గోల్డెన్ వుడ్స్ మ్యాప్ కూడా ఉంది, ఇది చిన్న పట్టణాల యొక్క లూటీ కి మరియు ఫైరింగ్ కి సరియన్ యుద్ధభూమిని అందిస్తుంది. అంతేకాకుండా, దాక్కొని ఆడటానికి ప్రత్యేకమైన పొదలను కూడా కలిగి ఉంటుంది.