పేస్ బుక్ మెసేంజర్ కెమేరా అప్డేట్ అయ్యింది: సెల్ఫీ, బూమేరాంగ్ మరియు AR స్టిక్కర్స్ మరియు మరెన్నో ప్రత్యేకతలు

పేస్ బుక్ మెసేంజర్ కెమేరా అప్డేట్ అయ్యింది:  సెల్ఫీ, బూమేరాంగ్ మరియు AR స్టిక్కర్స్ మరియు మరెన్నో ప్రత్యేకతలు
HIGHLIGHTS

వినియోగదారులు ఇపుడు అందుబాటులోవున్న AR స్టిక్కర్లతో పోటోలను జతచేసి పంపవచ్చు. గతంలో, కేవలం టెక్స్ట్ మెసేజీలను మాత్రమే పంపించే వీలుండేది.

మెసెంజర్ ఆప్  యొక్క కెమెరాలో రెండు కొత్త మోడ్లను పేస్ బుక్ ప్రకటించింది మరియు వినియోగదారులకి AR స్టికర్ల వినియోగాన్ని ఫోటోలు మరియు వీడియోలకు అవి నిజమనిపించేలా వాటికీ ఆపాదిస్తుంది. Selfie మోడ్ మరియు బూమేరాంగ్ వీడియోలు ఆప్ యొక్క కెమెరాకి రెండు మోడ్లు కూడా  జోడించబడ్డాయి. ఈ పద్ధతులు ఇప్పటికే Facebook యాజమాన్యంలోని Instagram ఆప్ లో అందుబాటులో ఉన్నాయి మరియు వినియోగదారులు ఇప్పుడు Facebook Messenger లోపల వాటిని ఉపయోగించే అవకాశాన్ని పొందుతారు.

"ఈరోజు మొదలుకొని, మెసెంజర్ పోస్టులు చేసేవారి మధ్య వీటిని మరింత సరదాగా చేయడానికి ప్రతిఒక్కరి ఇష్టమైన వీడియో-లూపింగ్ ఎఫెక్ట్,  బూమేరాంగ్ సహా మెసెంజర్ కెమెరాకు ఐదు రీతులు జతచేసారు. మేము సెల్ఫ్ మోడును కూడా జతచేసాము , ఇక్కడ మీరు మెసెంజర్ కెమెరాలో మిమ్మల్ని లేదా స్నేహితుల పోర్ట్రెయిట్లను తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ ఫోటో లేదా వీడియోను తీసుకున్నప్పుడు, బ్యాగ్రౌండ్ అస్పష్టంగా ఉన్నప్పుడు,  అదనపు గ్లో తో మీరు కనపడతారు. "అని ఒక బ్లాగ్ పోస్టులో కంపెనీ తెలిపింది.

మెసెంజరులో ఇప్పటికే ఉన్న కెమెరా మోడులు – నార్మల్ , వీడియో మరియు టెక్స్ట్, సులభతరం అవుతుందని పేస్ బుక్ చెపుతుంది. టెక్స్ట్ మోడ్లో, వినియోగదారులు ఇప్పుడు కొత్త ఫాంట్లను మరియు కలర్  బ్యాగ్రౌండ్లను ఉపయోగించవచ్చు మరియు స్టిక్కర్లు, మాస్కులు మరియు ఫిల్టర్లు వంటి కొత్త హాలిడే -థీమ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ, 20 మిలియన్లకు పైగా ప్రజలు ఫోటో మరియు వీడియో పోస్టుల కోసం కెమెరా ఎఫెక్టులను ఉపయోగిస్తున్నారు మరియు 440 మిలియన్ స్టిక్కర్లు మెసెంజర్ చాట్స్ లో పంపించబడుతున్నాయి.

ప్రముఖ టిప్స్టెర్ జేన్ మంచూన్ వాంగ్ పేస్ బుక్ మెసెంజర్ టెస్టింగ్ సెల్ఫ్ మోడ్ గురించి ట్వీట్ చేసిన ఒక నెల తరువాత, ఈ ప్రకటన వచ్చింది. ఈ లక్షణం, స్మార్ట్ ఫోన్ కెమెరా ఆప్లలో కనిపించే పోర్ట్రైట్ మోడ్ల వలె పనిచేస్తుంది, స్కిన్ సాఫ్టేనింగ్ మరియు బొకెతో సహా పనిచేస్తుందని ఆమె పేర్కొంది. మెసెంజర్, ఈ అక్టోబరులో సులభమైన నావిగేషన్, వ్యక్తిగతీకరించిన సంభాషణలు మరియు మరిన్నింటి కోసం ఈ ఆప్ లో అనేక మార్పులను ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo