ఇండియాలో Spotify మరియు YouTube మ్యూజిక్ విడుదల తరువాత, ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య పోటీ రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ రెండు కంపెనీలు కూడా ఇటీవలే భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డాయి మరియు వినియోగదారులకు ఉచిత సర్వీస్ మరియు పైడ్ సర్వీసులను కూడా ప్రకటించారు. అలాగే, JioSaavn మరియు Gana ఇటీవల వాటి వార్షిక చందా ధరలను తగ్గించాయి. ఇప్పుడు, ఆశ్చర్యంగా ఆపిల్ కూడా నిశ్శబ్దంగా దాని మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ యొక్క ధరను తగ్గించింది. ఆపిల్ మ్యూజిక్ ముందుగా నెలకు రూ.120 ధరతో అందించిన మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్, ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి నెలకు రూ .99 కు అందిస్తోంది.
ఈ సంస్థ కూడా స్టూడెంట్ మరియు ఫ్యామిలీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ కోసం కూడా దాని మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ యొక్క ధరను తగ్గించింది. వీటిని, రూ .49, రూ.149 ధరకు తగ్గించింది, ముందుగా ఇవి రూ.60, రూ.190 ధరతో ఉన్నాయి. ఇక వార్షిక ప్రాతిపదికన యాపిల్ మ్యూజిక్ కి సబ్ స్క్రిప్షన్ పొందిన వారు ముందుగా Rs.1,200 చెల్లించవలసి వచ్చేది, కానీ ఇప్పుడు 999 రూపాయలు చెల్లించాలి. పైన పేర్కొన్న విధంగా, Spotify మరియు YouTube మ్యూజిక్ భారతదేశంలో ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్రదేశంలోకి ప్రవేశించిన తరువాత ఆపిల్ తన ధరలను తగ్గించింది. Spotify యొక్క నెలవారీ సబ్ స్క్రిప్షన్ రూ .115, యుట్యూబ్ మ్యూజిక్ దాని నెలసరి చందా రూ.99 రూపాయలకు అందిస్తోంది.
ఇటీవలే JioSaavn మరియు Gaana కూడా వారి వార్షిక చందా ప్రణాళికలలో మార్పులు చేసాయి. JioSaavn మరియు Gaana వినియోగదారులు ఇప్పుడు రూ .299 ధరతో ఒక సంవత్సర చందా పొందవచ్చు. ఈ ధర తగ్గింపుకు ముందు, JioSaavn వార్షిక చందా ధర రూ .999 గా ఉంది, అదే గనా అయితే రూ. 1,098. ధరతో వుంది, గానా కూడా విద్యార్థులకు రాయితీ వార్షిక పథకాన్ని కలిగి ఉంది, ఇది రూ .149 ధరకే అందుతుంది. ఆపిల్ మినహా ఇక్కడ పేర్కొన్న అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులను ఉచితంగా అందుకోవచ్చు. అయితే, సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవడంతో, యాడ్ లేకుండా, ఆఫ్ లైన్ డౌన్లోడ్లు మరియు మరింత ప్రీమియం సేవలను అందుకుంటారు.
YouTube మ్యూజిక్ మరియు Spotify వారి సర్వీసులకు ఉచిత ట్రయల్ నెలవారీ ఆఫర్ను అందిస్తాయి మరియు మీరు ఉచితంగా మూడు నెలల పాటు YouTube యాడ్ ఫ్రీ కంటెంట్ను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది.