HIGHLIGHTS
కంపెని అప్ డేట్ ఇవకుండానే ఎన్క్రిప్షన్ ఫీచర్ ను అందిస్తుంది నిన్నటి నుండి
వాట్స్ అప్ ఇప్పుడు నిన్నటి నుండి అందరికీ ఫుల్ ఎన్క్రిప్షన్ సపోర్ట్ ను అందిస్తుంది. అంటే మీరు వాట్స్ అప్ ద్వారా పంపే ప్రతీ individual మెసేజ్..
మరియు గ్రూప్ మెసేజెస్ లకు ఈ encryption వర్తిస్తుంది. చాట్ లో ఇమేజెస్ ఉన్న కూడా. అంటే మీరు పంపే మెసేజ్ ను మధ్యలో హకెర్స్, గవర్నమెంట్ లేదా వాట్స్ అప్ టీం కూడా..చూడలేరు.
కేవలం పంపే వ్యక్తీ మరియు రిసీవర్ కు మాత్రమే అది చూడగలరు. ఎదో సరదాకి చాట్ చేసుకునే మనకు ఇది పెద్ద విషయం లా అనిపించకపోవచ్చు కాని..
ఇంటర్నెట్ ప్రపంచం లో ప్రివెసీ అనేది ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేయవలసిన విషయం. ఎటువంటి అప్ డేట్ ఇవకుండానే వాట్స్ అప్ లో ఈ ఫీచర్ యాడ్ అయ్యింది.
మీరు మెసేజ్ ను పంపితే చాట్ లో పైన మీ చాట్ ప్రొటెక్ట్ చేయబడింది అని కూడా మెసేజ్ చూపిస్తుంది. ప్రైవెసి ఆండ్రాయిడ్, ఐ ఫోన్ మరియు బ్లాక్ బెర్రీ users కు వచ్చింది.