రోడ్ సేఫ్టీ ను ఇంప్రూవ్ చేయటానికి NHAI నేషనల్ హై వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మొబైల్ అప్లికేషన్ ను లాంచ్ చేయనుంది. ఇది యూసర్స్ ను ట్రాఫిక్ రూల్స్ను violate చేసే వారి గురించి రిపోర్ట్ చేసే అవకాశం ఇస్తుంది.
ట్రాన్స్ పోర్ట్ రిజిస్ట్రేషన్ నెట్ వర్క్ తో ఇది అనుసంధానం అవుతుంది. ఎవరినా ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నట్టు అనిపిస్తున్నా వారి పై కంప్లైంట్ చేయగలరు యాప్ ద్వారా.
అయితే ప్రూఫ్ కోసం మీరు కంప్లైంట్ తో పాటు ఫోటో కూడా క్లిక్ చేసి పంపాలి. ఇది బయట రోడ్ పై వెళ్తున్నప్పుడు ఇబ్బంది కరంగా లేదా ఆకతాయి గా వెళ్ళే వాహనదారులపై కంప్లైంట్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
NHAI చైర్మన్, రాఘవ్ చంద్ర గత శుక్రవారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. యాప్ డెవలప్ మెంట్ లో ఉంది. త్వరలోనే రిలీజ్ అవుతుంది.