వాట్స్ అప్ కొత్త అప్ డేట్: ఫేస్ బుక్ అనుసంధానం మరియు ప్రైవెసీ ఫీచర్

Updated on 28-Jan-2016

వాట్స్ అప్ కొత్త వెర్షన్ అప్ డేట్ వచ్చింది. version 2.12.413. ఇది ఆండ్రాయిడ్ కు మాత్రమే ఉంది ప్రస్తుతానికి. ఈ కొత్త అప్ డేట్ ద్వారా రెండు పెద్ద ఫీచర్స్ ను తెచ్చింది facebook.

ఒకటి ఫేస్ బుక్ అనుసంధానం, రెండవది Encryption ఫీచర్. ఫేస్ బుక్ integration కొరకు వాట్స్ అప్ సెట్టింగ్ లోకి వెళ్లి, అకౌంట్ సెట్టింగ్స్ లోపల చూస్తె ఉంటుంది.

ఎన్క్రిప్షన్ ఫీచర్ కేవలం రూటింగ్ చేసుకున్న users కు పనిచేస్తుంది. జనరల్ users కు అందుబాటులో లేదు encryption ఫీచర్. రీసెంట్ గా ఎలెక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ చేపట్టిన ప్రైవేసీ రేటింగ్ లో వాట్స్ అప్ కు 7 కు 2 poor rating వచ్చింది .

సో కొత్తగా ఈ ప్రివేసీ ఎన్క్రిప్షన్ సెట్టింగ్స్ వలన సెక్యురిటీ లోపాలను అధిగమించటానికి ఫేస్ బుక్ ఎన్క్రిప్షన్ ను యాడ్ చేసింది అని అంచనా. కొత్త అప్ డేట్ ఇంకా ప్లే స్టోర్ లో లేదు. దీనిని ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

ఫేస్ బుక్ integration వలన వాట్స్ అప్ లో అదనంగా ఏమి సదుపాయాలు ఇవనుంది కంపెని అనేది ఇంకా స్పష్టత లేదు.  ఫేస్ బుక్ ను మీకు నచ్చితేనే అనుసంధానం చేయగలరు. అంటే integration అనేది ఆప్షనల్.

Connect On :