WhatsApp కొత్త అప్ డేట్ లో కొత్త “Hugs” మరియు ఇతర emoji’s

Updated on 11-Feb-2016

WhatsApp కొత్త అప్ డేట్ ను విడుదల చేసింది. ప్లే స్టోర్ లో కాదు. అఫీషియల్ వెబ్ సైట్ లో- లింక్. దీనిలో కొన్ని కొత్త emoji లను యాడ్ చేసింది. అప్ డేట్ వెర్షన్ నంబర్ v2.12.441. ఇది ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ కు మాత్రమే.

"హార్ట్ " emoji లను సింబల్స్ లో కలిపింది. ఇంతకముందు 'people and faces' కేటగిరి లో ఉండేవి ఇవి. అలాగే Flags కు సెపరేట్ సెక్షన్ యాడ్ చేసింది.

ఈ emoji అప్ డేట్ manual గా మీరు వెబ్ సైట్ లో నుండి whatsApp apk ను ఇంస్టాల్ చేసుకుంటే ఆల్రెడీ మీ యాప్ లో ఉంటాయి. అయితే ఇవేమీ ప్లే స్టోర్ లో ఇంకా విడుదల చేయటం లేదు వాట్స్ అప్.

బహుశా చిన్న చిన్న అప్ డేట్ లన్నీ కలిపి ఒక అప్ డేట్ గా రోల్ చేస్తుంది ఏమో అని అంచనా. అయితే ప్లే స్టోర్ కు రాకముందే మీరు వాట్స్ అప్ అప్ డేట్ లను పైన ఇచ్చిన లింక్ లోకి వెళ్లి అఫిషియల్ గా వాట్స్ అప్ సైట్ నుండి వాడుకోగలరు.

ప్లే స్టోర్ లో లాస్ట్ అప్ డేట్ 2.12.367 వెర్షన్ తో నవంబర్ లో రిలీజ్ చేసింది వాట్స్ అప్. అలాగే గత నెలలో 2.12.413 వెర్షన్ నంబర్ తో వాట్స్ అప్ కు ఎకౌంటు సెట్టింగ్స్ లో ఫేస్ బుక్ integration కూడా ఇచ్చింది.

ఇదే అప్ డేట్ లో ఎన్క్రిప్షన్ ఆప్షన్ కూడా అందించింది. అయితే ఇది కేవలం రూట్ చేసుకున్న వారికే కనిపిస్తుంది. రూటింగ్ అంటే ఏమిటో ఎలా చేసుకోవాలి ఈ లింక్ లో సింపుల్ గా చదవగలరు.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :