వాట్స్ అప్ కొత్త వెర్షన్ లో 5 కొత్త ఫీచర్స్/ఆప్షన్స్ యాడ్ అయ్యాయి
ఆండ్రాయిడ్ ఫోనులకు ప్లే స్టోర్ లో వాట్స్ అప్ కొత్త వెర్షన్ 2.16.264 అప్ డేట్ వచ్చింది. అయితే ఇది బీటా users కు మాత్రమే కనిపిస్తుంది. ఈ లింక్ లో బీటా యూసర్ ఏలా అవ్వాలో తెలపటం చూడగలరు.
సరే ఈ వెర్షన్ లో వచ్చిన ఫీచర్స్ గురించి చూద్దాం రండి..
వాట్స్ అప్ కెమెరా – ఈ రెండూ వాట్స్ అప్ లోని కెమెరా ఐకాన్ లో ఉంటాయి.
- ఫ్రంట్ ఫెసింగ్ flash – ఇది మీరు సేల్ఫీ తీసుకునేటప్పుడు స్క్రీన్ అంతా వైట్ కలర్ తో ఫిల్ అయ్యి లైటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కంప్లీట్ గా LED flash అంత లైటింగ్ ఇవ్వదు కాని డార్క్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంది.
- one-finger జూమింగ్ – మీరు వాట్స్ అప్ కెమెరా ఆప్షన్ తో రికార్డింగ్ చేయటానికి రికార్డ్ బటన్ పట్టుకొని ఉన్నప్పుడు మీ ఫింగర్ ను పైకీ క్రిందకీ స్లయిడ్ చేస్తే మీరు తీస్తున్న వీడియో లో జూమింగ్ అవటం, జూమ్ అవుట్ అవటం జరుగుతాయి. ఇవి ఆల్రెడీ snapchat అండ్ Instagram యాప్స్ లో ఉంది.
ఇమేజ్ డ్రాయింగ్ అండ్ స్టికర్స్: ఇమేజ్ పంపే ముందు text మరియు స్టికర్స్ ను కూడా యాడ్ చేసి పంపగలరు.
పెద్ద సైజ్ లో emojis: పేరులోనే తెలుస్తుంది. ఇది పెద్ద emojis ను పంపేందుకు సహాయ పడుతుంది. అయితే నంబర్ పెరిగే కొద్ది సైజ్ తగ్గుతుంది.
టెలిగ్రామ్ లింక్స్: గతంలో వాట్స్ అప్ లో టెలిగ్రామ్ లింక్స్ నిలిపివేయబడ్డాయి. ఇప్పుడు మరలా సపోర్ట్ చేస్తుంది ఈ వెర్షన్ నుండి. ఈ ఫీచర్స్ అన్నీ మీరు పైన లింక్ లోని తెలిపినట్లు బీటా వెర్షన్స్ కు రిజిస్టర్ అయితే, అందరికన్నా ముందు వాడుకోగలరు.