మనకి సాధారణంగా అప్పుడప్పుడు వాట్స్ యాప్ లో ఏమైనా అర్జంట్ ఫైల్స్ పంపాలంటే కుదరదు . వాట్సప్ లో ఫైల్స్ కొంత మేరకే పంపగలం. మిగతా ఫైల్స్ పంపటం చాలా కష్టం . అంటే 16 ఎంబి ఉన్న ఫైల్స్ అంతకన్నా పెద్ద ఫైల్స్ షేర్ చేయటానికి మీకు కొన్ని టిప్స్ వున్నాయ్.
whatstools యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ డౌన్‌లోడ్ అయిన తరువాత దాన్ని ఇన్‌స్టాల్ చేయండి.ముందుగా యాప్ పేజీలో గెట్ స్టార్టడ్ బటన్‌ను సెలక్ట్ చేసుకోగానే టర్న్ ఆన్ బటన్ వస్తుంది. కంటిన్యూ బటన్ పై క్లిక్ చేసి మీ గూగుల్ డ్రైవ్ లోకి సైన్-ఇన్ అవ్వమని అడుగుతుంది.
అప్పుడు మీరు గూగుల్ అకౌంట్ Allow అనే ఆప్సన్ మీద క్లిక్ చేసి మీరు ఏ వీడియోని అయితే పంపాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసి దాన్ని మీరు షేర్ బటన్ తో మీరు వాట్సప్‌లోకే కాకుండా ఇతర సోషల్ మీడియా యాప్‌లోకి సెండ్ చేసుకోవొచ్చు. దీని ద్వారా సింపుల్‌గా మీరు ఎక్కువ జిబి ఉన్న ఫైళ్లను ఇలా పంపటం సులభము