Whats App సరికొత్త ఫీచర్లతో ఇప్పుడు మనముందుకు వచ్చేస్తోంది .మనం సాధారణం గా మన ఫీలింగ్స్ ని ఎమోజీల రూపం లో మిగతా వారితో షేర్ చేస్తాం . అయితే వీటి కోసం వాట్స్ యాప్ సెర్చ్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.
ఇప్పటివరకు మనకి కావలసిన కావాల్సిన ఎమోజీలను సైడ్ స్క్రోల్ చేస్తూ సెర్చ్ చేసేవాళ్ళం . కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాటికోసం సెర్చ్ ఆప్షన్ వచ్చేసింది . దీనిలో మీకు కావాల్సిన ఎమోజీలను టైప్ చేయండి .అంతే వాటికి రిలేటెడ్ ఎమోజీలన్నీ మెసేజ్ టైప్ చేసే కిందకు వస్తాయి.
అయితే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అవైలబుల్ , మిగతా వెర్షన్లకు రావటానికి ఇంకా టైం వుంది . బీటా వెర్షన్ 2.17.246 ఎమోజీ సెర్చ్ యాక్టివేట్ అయినట్టు కంపెనీ తెలిపింది .