ఫేస్ బుక్ లో తాజగా కొత్త యాప్ వచ్చింది. ఇది మీరు ఫేస్ బుక్ లో ఎక్కువుగా వాడిన వర్డ్స్ ను చెబుతుంది. అయితే కొన్ని లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం దీనిని వాడటం మంచి కాదు అని స్పష్టం అవుతుంది.
యాప్ పేరు "Most used words on facebook". ఒక సారి మీ ఫ్రెండ్ షేర్ చేసిన దానిపై క్లిక్ చేయగానే మిమ్మల్ని కూడా పర్మిషన్స్ అడుగుతుంది డేటా ను చదవటానికి.
మీరు పెట్టిన స్టేటస్ ల నుండి వర్డ్స్ సేకరించి ఒక ఇమేజ్ రూపంలో ఎక్కువుగా వాడిన వర్డ్స్ ను చూపిస్తుంది. ఈ ఇమేజ్ ను మీ టైమ్ లైన్ పై షేర్ కూడా చేసుకోవచ్చు.
కంపేరి టెక్ రిపోర్ట్స్ ప్రకారం ఇది సేకరించిన మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ వేరే డేటా లను వాడుకునే సర్వర్స్ కు అమ్ముతుంది. పర్మిషన్స్ యాక్సెప్ట్ చేస్తే దానికి అవసరం లేని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుంది.
అంటే మీ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్, all ఇమేజెస్. అలాగే యప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మీ ఇన్ఫర్మేషన్ ను మీరు దాని తో సంబంధాలు డిలిట్ చేసినా స్టోర్ చేస్తుంది అలాగే వాటిని ఏ సర్వర్స్ లో అయినా ఎక్కడైనా స్టోర్ చేయవచ్చు అని ఉంది.