మైక్రోసాఫ్ట్ నివేదికలలో 'ఐన్స్టీన్' అనే ఒక కృత్రిమ మేధస్సు ప్రాజెక్ట్ పరిశోధన ఆధారంగా ఒక ఆధునిక డిజిటల్ వెర్షన్ అసిస్టెంట్ పై మైక్రోసాఫ్ట్ పనిచేస్తున్నట్లు తెలిసింది. నివేదికల ప్రకారం, ఆండ్రాయిడ్ మరియు ఐ ఓస్ నడుస్తున్న మొబైల్స్ కోసం ఒక స్వతంత్ర ఆప్ గా కార్టానా విడుదలకు సిద్దంగా ఉంది.
ప్రస్తుతం కేవలం విండోస్ ఫోన్ ఓఎస్ కు మాత్రమే అందుబాటులో ఉన్నది కార్టానా. తాజాగా మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటనలలో, సరికొత్త వెర్షన్ ద్వారా ఎప్పటినుండో బాగా ప్రచారంలో ఉన్న విండోస్ 10 తో డెస్క్టాప్ ఓ ఎస్ లకు త్వరలో అందుబాటులోకి రానున్నది కార్టానా.
"ఇమెయిల్ ను చదివి అర్థం చేసుకునే సరికొత్త టెక్నాలజీ కార్టానా తదుపరి వెర్షన్ లో కీలకమైన అంశం గా ఉండనుంది." అని ఎరిక్ హార్విట్జ్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ మరియు ఐన్స్టీన్ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.
కార్టానా ఇతర ఓ ఎస్ ప్లాట్ఫార్మ్ లపై విడుదల చేసి, క్రాస్ ప్లాట్ఫార్మ్ కు పునాదిగా తీసుకున్నఈ నిర్ణయం వెనుక, ఆపిల్ మరియు గూగల్ ఆండ్రాయిడ్ లతో పోటీలో మైక్రోసాఫ్ట్ ను పునరుద్ధరించాలని సత్య నాదెళ్ళ ముందుచూపు కనపడుతుంది.