విండోస్ ఆప్స్ లో ఫేస్బుక్ సపోర్ట్ ను సస్పెండ్ చేసిన మైక్రోసాఫ్ట్

విండోస్ ఆప్స్ లో ఫేస్బుక్ సపోర్ట్ ను సస్పెండ్ చేసిన మైక్రోసాఫ్ట్
HIGHLIGHTS

ఫోటో గేలరీ, మూవీ మేకర్, onedrive.com లకు ఇక నుండి ఫేస్బుక్ కనెక్ట్ ఫీచర్స్ ఉండవు.

గత వారం ఫేస్బుక్ అనుసంధానాన్ని విండోస్ ఆప్స్ నుండి ఆపివేయనుంది అని చెప్పింది మైక్రోసాఫ్ట్. ఫేస్బుక్ కొత్త గ్రాఫ్ API అప్డేట్ కారణంగా మేము ఫేస్బుక్ ను షట్ డౌన్ చేస్తున్నాము అని చెప్పింది.

మైక్రోసాఫ్ట్ దీనిపై ఇచ్చిన స్టేట్మెంట్..
"మైక్రోసాఫ్ట్ ఆప్స్ ను దెబ్బ తీసే విధంగా కొత్త ఫేస్బుక్ గ్రాఫ్ API  అప్డేట్ దించింది ఫేస్బుక్. గ్రాఫ్ API టూల్ ద్వారా మైక్రోసాఫ్ట్ అకౌంట్ ను ఫేస్బుక్ కు కనెక్ట్ చేసేవాల్లం మేము. ఇది మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ను outlook.com మరియు విండోస్ పీపుల్ ఆప్ లో కాంటాక్ట్స్ ను అప్ టు డేట్ గా ఉంచి ఫోటో గేలరీ, మూవీ మేకర్ మరియు onedrive.com లో ఫేస్బుక్ షేరింగ్ ఫీచర్స్ వంటివి సహకరిస్తుంది. ఇదంతా ఫేస్బుక్ కనెక్ట్ ఫీచర్స్." 

దీని వలన అవుట్ లుక్.com, విండోస్ ఫోన్, ఆఫీస్ 365 కేలండర్ సింక్  బాగా ఇంపాక్ట్ అయ్యాయి. ఇక నుండి ఫేస్బుక్ ఈవెంట్స్ outlook.com కు ఆటోమేటిక్ గా సింక్ అవ్వవు. దీని బదులు outlook.com కేలండర్ నుండి ఫేస్బుక్ ఇచ్చే లింక్ ద్వారా మీరు అదే పనిని చేసుకోవచ్చు అని ఆల్టర్నేటివ్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్.  విండోస్ 8 ఫోటో గేలరీ మరియు మూవీ మేకర్ ఆప్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఇక నుండి మీరు వాటి నుండి కూడా ఫోటోస్ మరియు వీడియోస్ ఫేస్బుక్ లో డైరెక్ట్ గా షేర్ చేయలేరు. కాని ఇంతకముందు షేర్ చేసిన కంటెంట్ మాత్రం అలానే ఉంటుంది. ఇక్కడ పూర్తి రిపోర్ట్ ను చదవగలరు.

 

Kul Bhushan
Digit.in
Logo
Digit.in
Logo