ఆండ్రాయిడ్ 4.4.4 కిట్ కేట్ ఫోన్లకు బీటా ఆఫీస్ ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్. ప్రస్తుతానికి దీనిలో ఎక్సల్, వర్డ్ మరియు పవర్ పాయింట్ ఆప్స్ అందిస్తుంది. ఫైనల్ వెర్షన్ బిల్డ్ చేసుకోవడానికి యూజర్స్ ని ఇంస్టాల్ చేసుకోమని ఫీడ్ బ్యాక్ అడుగుతుంది మైక్రోసాఫ్ట్.
దీన్ని వాడుటకు వినియోగదారులు Android కమ్యూనిటీ యొక్క ఆఫీస్ జాయిన్ అవ్వాలి. టెస్ట్ చేయుటకు మినిమమ్ 1జిబి ర్యామ్ ఉండాలి. ఈ బీటా ఆప్ లో మీరు ఆఫీస్ ను ఫైల్స్ ఓపెన్, ఎడిట్ మరియు సేవ్ చేయటకు ఉపయోగించుకోగలరు. మీరు ఒకవేల ఏదైనా ఉమ్మడి ప్రాజెక్ట్ చేస్తుంటే, మీ డాక్యుమెంట్స్ పై కామెంట్స్ మరియు ట్రాకింగ్ చేసుకునే పనులు ఈ బీటా ఆప్ పై పనిచేస్తాయి. ఈ ఆప్ కచ్చితంగా గూగల్ అప్ప్స్ (షీట్స్, డాక్స్ మరియు స్లైడ్స్) మరియు ఇతర ఆఫీస్ ఆప్స్ ల్ పై ఒత్తిడి తెస్తుంది.
మైక్రోసాఫ్ట్ మాట్లాడుతూ.."ఆఫీస్ ఆప్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్ పనులు ఇకనుండి మొబైల్ లోనే చేసుకోవచ్చు. ఫైనల్ వెర్షన్ లో మరిన్ని సదుపాయాలు, ఆప్షన్స్ రానున్నాయి" అని చెప్పింది.
ఆధారం: మైక్రోసాఫ్ట్