మైక్రోసాఫ్ట్ సొంత ప్లాట్ ఫార్మ్ కు కాకుండా ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ప్లాట్ ఫార్మ్ కోసం యాప్స్ ను డెవలప్ చేయటం అనేది తెలిసిన విషయమే. యాప్ లింక్. అయితే ఇది కొన్ని దేశాలలోనే అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతానికి.
రీసెంట్ గా Hub Keyboard పేరుతో సరి కొత్త కీ బోర్డ్ యాప్ ను డెవలప్ చేసింది ఆండ్రాయిడ్ కోసం. ఇది మైక్రోసాఫ్ట్ garage experimetal ప్రాజెక్ట్ నుండి వచ్చిన క్రియేషన్.
ఆఫీస్ ఫైల్స్, కాంటాక్ట్స్, లోకల్ క్లిప్ బోర్డ్ మరియు translation టూల్స్ కు క్విక్ access అందిస్తుంది. ఇప్పటికే కంపెని ఆండ్రాయిడ్ లో ఫేమస్ అయిన Swiftkey కీ బోర్డ్ ను కూడా సొంతం చేసుకుంది.
హబ్ కీ బోర్డ్ కు టాప్ లో ఉండే చిన్న బార్ లో వేరే యాప్ లో ఉండే సమాచారాన్ని చూపిస్తుంది. అంటే ఇది ఇన్ఫర్మేషన్ ను కాపి చేయటానికి వేరే యాప్స్ వంటివి ఓపెన్ చేయకుండానే use అవుతుంది.
ఫర్ eg మీరు ఎవరికైనా ఫోన్ నంబర్ ను షేర్ చేయాలంటే, కాంటాక్ట్స్ యాప్ ను ఓపెన్ చేయకుండానే కీ బోర్డ్ లో కాంటాక్ట్ సర్చ్ చేసి నంబర్ ను insert చేయగలరు పంపాలనుకునే వారికీ.. అలాగే అక్కడిక్కడే translation కూడా.
ఇంతకముందే ఐ ఫోన్ users కు కూడా మైక్రోసాఫ్ట్ ఒక కీ బోర్డ్ డెవలప్ చేసింది. ఇది అచ్చం విండోస్ వర్డ్ ఫ్లో వలె ఉంటుంది. అయితే దీనికి redmond calif based టెక్నాలజీ జోడించటం వలన సింగిల్ హ్యాండ్ textting కు అవకాశం వచ్చింది ఐ ఫోన్ లో.
గతంలో మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ లాంచర్ అప్లికేషన్ పై ఈ లింక్ లో తెలుసుకోండి.