Microsoft నివేదికల ప్రకారం, దాని Outlook ఇన్బాక్స్ అప్లికేషన్ కోసం ' ఫ్లో ' అనే కొత్త ఐఫోన్ చాట్ ఆప్ ను అభివృద్ధి చేస్తుంది. చాట్ ఆప్ Gmail మరియు Outlook సహా అన్ని ఇమెయిల్ సర్వీసస్ పై పని చేస్తుంది.
ఈ ఆప్ గురించి వివరాలు ఒక ట్విట్టర్ యూజర్ (h0x0d) కి వేరే డౌన్లోడ్ పేజ్ లో "Microsoft Confidential" అని కనిపించటం తో అదే విషయాన్ని ట్విట్ చేసాడు. ఫ్లో చాలా ఫాస్ట్ గా ఉండనుంది. సబ్జెక్ట్ లైన్స్, సిగ్నేచర్స్ ఏమీ లేకుండా సింపిల్ గా చాట్ కన్వర్జేషన్స్ ఉండనున్నాయని అంటున్నారు. జి మెయిల్ అనే కాకుండా ఏ మెయిల్ ఐడి ఉన్నా ఇది చాట్ చేసేందుకు అనుమతిస్తుంది. మీరు చాట్ చేయబడిన కన్వర్జేషన్స్ అని ఔట్లుక్ లో ఉంటాయి. "Focus on what's important" అనేది 'ఫ్లో' ఆప్ టాగ్ లైన్ దిస్క్రిప్షణ్ గా ఉంది. 'ఫ్లో' లో మీరు మొదలుపెట్టిన చాట్ కన్వర్జేషన్స్ మరియు వాటి రిప్లైస్ మాత్రమే 'ఫ్లో' లో కనిపించనున్నాయి, మొత్తం ఇన్బాక్స్ అంతా కనిపించదు.
కథనాలు ప్రకారం ఫ్లో ఆప్ లో గ్రూప్ చాటింగ్ ఫీచర్ కూడా జోప్పించనున్నారు. కానీ ప్రస్తుతానికి వీడియో చాటింగ్ ఇందులో పనిచేయదు. ఫ్లో విడుదల చేసే టైముకి దానిని అనుసందనించే అవకాశాలు ఉన్నాయి. స్కైప్, ఔట్లుక్ మరియు Qik లకు 'ఫ్లో' పనిచేయనుంది. గత సంవత్సరం మైక్రోసాఫ్ట్ స్కైప్ Qik అనే ఒక చిన్నస్నాప్ చాట్ మాదిరి వీడియో మెసేజింగ్ ఆప్ ను విడుదల చేసింది. ఫ్లో చాలా లైట్ వెయిట్ తో మైక్రోసాఫ్ట్ కి కూడా ఇన్స్టాంట్ చాట్ అప్లికేషన్ మార్కెట్ లో ఓపెనింగ్ ఇవ్వనుంది అని అంటున్నారు. అయితే ఇంతవరకూ మైక్రోసాఫ్ట్ ఈ అప్లికేషన్ పై అఫీషియల్ అనౌన్సుమెంటు చేయలేదు. ఆశ్చర్యంగా ఆపిల్ ప్లాట్ఫారం ను ఎంచుకున్న ఆపిల్, తరువాతి కాలంలో ఆండ్రాయిడ్ మరియు తన సొంత విండౌస్ ప్లాట్ఫారం లపై ఫ్లో విడుదల చేస్తుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ఆధారం: Tweet