మైక్రోసాఫ్ట్ నుండి రానున్న నెక్స్ట్ debut, మొబైల్ డెవలప్మెంట్ కు సంబందించింది. దీని పేరు Send. ఇది మొబైల్ యాప్.e mail తో పాటు instant మెసేజింగ్ కూడా ఇవ్వటమే దీని ప్రధాన ఫీచర్.
ఫార్మల్ మెసేజింగ్ ఫార్మేట్లకు చెక్ పెట్టి, తొందరగా మెసేజ్ లను ఆఫీస్ కొ వర్కర్స్ కు పంపిస్తుంది. మెయిల్ లో ఉండే అనేక ఫీల్డ్స్ ను నింపే అవసరం ఉండదు.జస్ట్ recipient నేమ్ మరియు మెసేజ్ అంతే. మీరు ఉన్న స్టేటస్ బట్టి ఆటోమేటిక్ గా కూడా ప్రీ defined templates పంపుతుంది.
మైక్రోసాఫ్ట్ అఫిషియల్ గా దీని గురించి "ఎటువంటి subject line మరియు ఫార్మల్ email విధానాలు లేకుండా మెసేజ్ చేరవేయటమే దీని ఉపయోగం" అని చెప్పింది. మెసేజ్లు అన్ని outlook లోని inbox లో ఉంటాయి. మీరు వాట్స్ అప్ వంటి యాప్స్ లో చూసే టైపింగ్ నోటిఫికేషన్ ఫీచర్ దీని ద్వారా email లో కూడా వస్తుంది. అలాగే అవతలు వ్యక్తులు మీ email చదివిన వెంటనే చెబుతుంది.
ప్రస్తుతం Send యాప్ ఐ os కు మాత్రమే ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ మరియు విండోస్ కు రానుంది. మొదటిగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 సబ్స్క్రైబర్స్ కు మాత్రమే ఇది లభిస్తుంది. దీని గురించి మిగిలిన వారికి తెలియటానికి అయినా అందరికీ విడుదల చేస్తుంది. ప్రస్తుతం US కెనడా రీజియన్ లలో వర్క్ అవుతుంది. అన్ని టెస్ట్ బేస్డ్ రివ్యూస్ అయిపోతే అందరికీ రిలీజ్ చేయనుంది.