రెండు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇప్పుడు జత కట్టాయి. పెరుగుతున్న కాంపిటీషన్ తో పాటు కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎదురు చూస్తున్న కళాకారులు ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే, మ్యూజిక్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ ప్రపంచ దిగ్గజం Universal Music Group తో Meta చేతులు కలిపింది. ఈ కొత్త చర్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్టిస్ట్ లకు మంచి అవకాశాలు అందుతాయి. అంతేకాదు, ఈ కొత్త చర్యలో భాగంగా వాట్సాప్ లో ఒక కొత్త ఫీచర్ ను జత చేయడానికి వాట్సాప్ చూస్తునట్టు కూడా చెబుతున్నారు.
UMG ఆర్టిస్ట్ లు మరియు యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ తో పాటు చాలా మంది ఆర్టిస్ట్ లకు కమర్షియల్ అవకాశాలు అందించడానికి మెటా మరియు యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ మల్టీ ఇయర్ అగ్రిమెంట్ సైన్ చేసాయి. ఈ అగ్రిమెంట్ ద్వారా AI నిర్మిత కంటెంట్ ను నిలువరించి, ఆర్టిస్ట్ లు మరియు లిరిక్ రైటర్ లకు ప్రోత్సాహం అందించడమే కాకుండా, వారికి తగిన న్యాయ పరిహారం అందించడానికి కృషి చేస్తాయి.
ఈ విషయాన్ని ఇరు కంపెనీలు కూడా ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించారు. అయితే, ఈ కొత్త చర్య తో పాటు వాట్సాప్ లో ఒక కొత్త ఫీచర్ ను జత చేయబోతుంది, అని WABetaInfo తెలిపింది. వాబీటాఇన్ఫో తన X అకౌంట్ నుంచి ఈ విషయాన్ని వివరిస్తూ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ ప్రకారం, వాట్సాప్ లో వచ్చే కొత్త ఫీచర్ తో iOS మరియు ఆండ్రాయిడ్ యూజర్లు స్టేటస్ అప్డేట్ లో మ్యూజిక్ కోసం సెర్చ్, సెలెక్ట్ మరియు షేర్ ఆప్షన్ లను అందుకుంటారని తెలిపింది. అంటే, కొత్త ఫీచర్ తో యూజర్లు వారికి కావాల్సిన మ్యూజిక్ ను సెర్చ్ చేసి, నచ్చిన వాటిని సెలెక్ట్ చేసి, ఆ మ్యూజిక్ ను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 19 వేలకే బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart tv అందుకోండి.!
వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ను మరింత సౌకర్యవంతంగా మార్చడానికి ఈ కొత్త ఫీచర్ సహాయం చేస్తుంది. ఈ అప్ కమింగ్ ఫీచర్ మరిన్ని అప్డేట్స్ తో కొత్త ట్వీట్ చేస్తుందని కూడా వాబీటాఇన్ఫో తెలిపింది.