ఇటీవల కాలంలో అత్యధికంగా వార్తల్లో నిలిచింది ఈ TikTok, దీని వలన యువత పెడదారిన పడుతున్నారని, దాన్ని సేవలు భారతదేశంలో నిలిపివేయటం మంచిదని, TikTok ని విలువరించిన మద్రాస్ హై కోర్ట్ ఎట్టకేలకు, TikTok ప్రియులకు తీపి కబురును వినిపించింది. బుధవారం నాడు దీని పైన విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లు మద్రాస్ ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది.
ఎక్కువ శాతం యువత దీన్ని వివిధ రకాలైన మరియు విపరీతమైన తప్పుదోవలకు మళ్లించే వీడియోలను తియ్యడానికి విపయోగించడం పరిపాటిగా మొదలయ్యింది. ఇక్కడి నుండే కథ మొదలయ్యింది, దీని వలన పరువు పోయి కొంత మంది ఆత్మహత్య చేసుకోగా, వీడియోలు చిత్రించడం కోసం ప్రయోగాలు చేసి కొంత మంచి ప్రాణాలను కోల్పోయారు. ఇటీవల టిక్ టాక్ వీడియో చిత్రీకరణ సమయంలో అనుకోకుండా తుపాకీ పేలి ఢిల్లీ నగరంలో ఒకరు చనిపోయిన ఘటన ఉధాహరణగా చెప్పొచ్చు.
అయితే, ఇప్పుడు అటువంటి అవకాశం ఇందులో ఉండదు. ఎందుకంటే, న్యూడ్ లేదా అసభ్యకరమైన విధంగా వుండే మరియు అభ్యంతకరమైన వీడియోలను, ఇందులో అప్లోడ్ చేసే వీలులేకుండా TikTok ని సరిచేసినట్లు దీని యొక్క యజమాని అయినటువంటి 'బైట్ డాన్స్' పేర్కొన్నారు. ఇందులో, ఎటువంటి అంశాలయితే ఉండకూడదని మద్రాస్ హై కోర్ట్ సూచించిందో, అటువంటి వాటిని తొలగించడంతో పాటుగా, ఇక నుండి అప్లోడ్ చేసే అవకాశాన్ని పూర్తిగా నియంత్రించడం వలన, మద్రాస్ హై కోర్ట్ దీని పైన విధించిన నిషేధాన్ని ఎత్తి వేసినట్లు తెలుస్తోంది.