కేబుల్ లేదా డిటిహెచ్ యూజర్లు తాము ఎంచుకున్న ఛానళ్ల కోసం లేదా తాము ఉపయోగించే వాటి కోసం మాత్రమే చెల్లించాలని, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), ఒక ఆదేశాన్ని జారీచేసింది మరియు రేపటి నుండి ఇది అమలవుతుంది. అదే సమయంలో, DTH ప్రొవైడర్ మరియు చందాదారులకు మధ్య అనుసంధానంగా, ట్రాయ్ ఇప్పుడు కొత్త web – Application తీసుకొచ్చింది. దీని సహాయంతో, చందాదారులు చాలా సులభంగా వారికీ కావాల్సిన ఛానళ్ల యొక్క ధరలను మరియు పూర్తి వివారాలను కూడా తెలుసుకోవచ్చు.
ట్రాయ్ – Channel Selector Application
ట్రాయ్ చందాదారులు కోసం తీసుకొచ్చిన వెబ్ అప్లికేషన్ అయినటువంటి Channel Selector Application సహాయంతో, వినియోగదారులు వారి ఛానల్ ప్యాకేజీ యొక్క MRP ని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. కావలసిన ఛానళ్లను యాడ్ చేసినపుడు, ఈ ఆప్ చందాదారులు చెల్లించాల్సిన ఛానళ్ల యొక్క మొత్తం ధరను చూపుతుంది. వినియోగదారులు తమ ప్రొడక్టులను ఆన్లైన్ షాపింగ్ సైట్లో షాపింగ్ కార్టుకు జోడించడం ద్వారా, కావల్సిన ఛానెల్ యొక్క ఎంపిక సులభం అవుతుంది. వినియోగదారులు ఎంచుకున్న అన్ని ఛానళ్లను వారు చూడగలరు. దీనితో, మీకు ఏ ఆఫర్ అయినా అందుబాటులో ఉంటే, ఈ ఆప్ మీ ఛానెల్ యొక్క ధరలకు, ఆ ఆఫర్ను జోడిస్తుంది మరియు మీ ఛానెళ్ల యొక్క సంఖ్యను తగ్గించకుండా ఆ ఛానెల్ యొక్క ధరను తగ్గించవచ్చు. వినియోగదారులు, ఈ ఆప్ నుండి వారి ఛానెల్ను ప్రింట్ మరియు డౌన్లోడ్ చేయవచ్చు.
మీరు Channel Selector Application (link) తెరిచినప్పుడు, మీరు మీ పేరు, భాష, రాష్ట్రం, ఇష్టమైన జెన్నర్ వంటి కొన్ని సమాచారాన్ని ఇవ్వాలి, దాని తర్వాత మీరు ఎంపిక ప్రక్రియకు వెళతారు.