Jio Finance App ను కొత్త ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ మరియు iOS కోసం అందించింది.!

Jio Finance App ను కొత్త ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ మరియు iOS కోసం అందించింది.!

Jio Finance App ను ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. 2024 మే 30 వ తేదీ ఈ యాప్ బీట్ వెర్షన్ ను విడుదల చేసిన కంపెనీ యూజర్ల నుంచి రివ్యూలు కోరింది. యూజర్ల నుంచి రివ్యూలను అందుకున్న తర్వాత చేసిన మార్పులు చేర్పులు తర్వాత ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ తో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ యాప్ 6 లక్షల కంటే పైగా యూజర్ల రివ్యూలను అందుకున్నట్లు తెలిపింది.

Jio Finance App

కొత్తగా ఫైనాన్స్ సర్వీస్ లోకి అడుగుపెట్టిన జియో, ఈ కొత్త జియో ఫైనాన్స్ యాప్ ని తీసుకు వచ్చింది. ఈ యాప్ ని యూజర్ ఫ్రెండ్లీగా మరియు తగిన ఫీచర్ తో అందించడానికి ముందుగా బీటా వెర్షన్ ను అందించింది. ఈ బీటా వెర్షన్ నుంచి ఈ యాప్ ను మరింత మెరుగు పర్చడానికి అందుకున్న యూజర్ రివ్యూలతో ఈ యాప్ ని సరి చేసింది. కొత్తగా చేసిన మార్పులు మరియు ఫీచర్స్ తో ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. 

బీటా వెర్షన్ లో లోన్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ లోన్స్ మరియు హోమ్ లోన్ వంటి లోన్ ఆప్షన్ లను అందించింది. ఇప్పుడు మరిన్ని  ఫీచర్స్ తో ఈ యాప్ ను అందించింది. ఈ యాప్ లో ఇప్పుడు UPI Payment, UPI ID లేదా నంబర్ ద్వారా పేమెంట్, బ్యాలెన్స్ చెక్ మరియు UPI హిస్టరీ వంటి ఫీచర్స్ తో అందించింది. 

Also Read: WhatsApp లో కొత్తగా కస్టమైజ్ చాట్ థీమ్స్ ని 20 రంగుల్లో పరిచయం చేసింది.!

ఈ యాప్ ద్వారా లోన్ తో పాటు బిల్ పెమెంట్స్ మరియు UPI పెమెంట్స్ సౌలభ్యాన్ని కూడా జియో అందించింది. Jio Payments Bank ను కూడా ఇందుకు జత చేసుకొని mPIN లేదా బయో మెట్రిక్ తో యాక్సెస్ చేసుకోవచ్చని కూడా జియో తెలిపింది. ఈ యాప్ లో జెస్ట్ చాట్ ద్వారా వివరాలు అందించిన మ్యూచువల్ ఫండ్స్ అపి లోన్ అందుకోవచ్చు. అంతేకాదు, ఇందులో చాలా ఈజీగా సేవింగ్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు మరియు సేవింగ్ అకౌంట్ లోని సేవింగ్స్ పై 3.5% ఇంట్రెస్ట్ పొందవచ్చని కూడా జియో వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo