తక్కువ ఇంటర్నెట్ డేటా ఉందా? కాని బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ మీ డేటా ను వాడేస్తున్నాయి. మీరు కేవలం వాట్స్ అప్ అండ్ ఫేస్ బుక్ వంటి యాప్స్ కు మాత్రమే వాడటానికి ప్రయత్నిస్తున్నారు.
సాధారణంగా నెట్ అవసరం అయినప్పుడు మాత్రమే ఆన్ చేసుకొని, అవసరం లేనప్పుడు ఆఫ్ చేయటం వంటివి చేస్తారు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు. కానీ ఈ పద్దతిలో కొన్ని మెసేజెస్ మిస్ అవుతుంటారు.
సో, మీకు కావలసిన అప్లికేషన్ కు తప్ప మిగిలిన వాటికీ ఇంటర్నెట్ బ్లాక్ చేయటానికి ప్లే స్టోర్ లో కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ యాప్ – Mobiwol. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో 4.1 స్టార్ రేటింగ్ తో ఉంది. 3.4MB సైజ్.
దీనిని వాడటానికి మీ ఫోన్ రూటింగ్ అయ్యి ఉండనవసరం లేదు. ఎవరైనా వాడుకోవచ్చు.
ఫీచర్స్..
1. మొబైల్ ఇంటర్నెట్ లో లేదా WiFi నెట్ లో విడివిడిగా యాప్స్ ను డిసేబుల్ చేయగలరు. అంటే ఒకే యాప్ ను మొబైల్ ఇంటర్నెట్ లో పనిచేయకుండా, WiFi లో ఇంటర్నెట్ వాడేలా సెట్ చేయగలరు.
2. యాప్స్ లిస్ట్ లో యాప్ ను రైట్ సైడ్ కు స్వైప్ చేస్తే యాప్ బ్యాక్ గ్రౌండ్ లో ఇంటర్నెట్ ను వాడకుండా ఉండేలా సెట్ చేసుకోవచ్చు.
3. ఒకేసారి అన్నీ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఇంటర్నెట్ ను వాడకుండా సెట్ చేయగలరు. అంటే మీకు కేవలం వాట్స్ అప్ మాత్రమే పనిచేయాలి అనుకుంటే, అన్నీ డిసేబుల్ చేసి, వాట్స్ అప్ మాత్రం enable చేయగలరు.
సిస్టం యాప్స్ కు మాత్రం ఇంటర్నెట్ డిసేబుల్ చేయకండి. చేస్తే మీ ఫోన్ సరిగా పనిచేయకపోవచ్చు.
గమనిక: యాప్ ను డౌన్లోడ్ చేసుకునే ముందు Description లో FAQ లో ఈ Question ( Why does Mobiwol No Root Firewall show as if using a VPN connection? ) చదవి అవగాహనతో యాప్ ను వాడండి.