గూగల్ I/O 2016 Keynote ఈవెంట్ లో ఆండ్రాయిడ్ instant apps ను అనౌన్స్ చేసింది కంపెని. ఇది మీరు ఇంస్టాల్ చేయకుండానే యాప్ ను చూపిస్తుంది.
ఒక లింక్ ద్వారా మీరు యాప్ ను స్ట్రీమింగ్ చేసి మీకు దానిలోని ఫంక్షన్స్ ను అందిస్తుంది. మీకు అవ్వి నచ్చితే యాప్ ను ఇంస్టాల్ చేసుకోగలరు.
అంటే మీకు ఎవరైనా ఏదైనా యాప్ యొక్క లింక్ లేదా ప్రోడక్ట్ షేర్ చేసినప్పుడు మీకు ఆ యాప్ లేకపోయినా డైరెక్ట్ గా యాప్ లోని కంటెంట్ చూడగలరు.
ప్రోడక్ట్ మేనేజర్ సురేష్ గణపతి దీని functioning ను డెమో చేసి తెలియజేశారు. అవసరమైన modules మాత్రమే access చేస్తూ ఇది పనిచేస్తుంది.
ఇది ఆండ్రాయిడ్ Jelly Bean OS వెర్షన్ నుండి అందరికీ పనిచేస్తుంది. యాప్ డెవలపర్స్ కూడా సెపరేట్ గా instant యాప్స్ వంటివి డెవలప్ చేయనవసరం లేదు.
అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం తక్కువ యాప్స్ తో పనిచేస్తుంది. కంప్లీట్ గా ఇది users కు 2016 ending లో రానుంది. మరింత సమాచారం ఈ లింక్ లో చూడండి.