Instagram: కొత్త ఫీచర్ తో మరింత సౌకర్యం..ఏమిటా ఫీచర్ అంటే.!
Instagram లో ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ వచ్చి చేరింది
ఈ కొత్త ఫీచర్ తో యూజర్లకు మరింత సౌకర్యం అందుతుంది
కొత్తగా జతచేసిన ఆ సరికొత్త ఫీచర్ ఏమిటో ఒక లుక్కేయండి
యువతను ఉర్రుతలూగిస్తున్న Instagram లో ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ వచ్చి చేరింది. రోజు రోజు కొత్త పోస్ట్ లలో ఇన్స్టాగ్రామ్ లో తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్న యువతకు ఈ అప్డేట్ మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఇటీవలే రీల్స్ డౌన్ లోడ్ ఫీచర్ ను తీసుకు వచ్చిన ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ తో యూజర్లకు మరింత సౌకర్యం అందుతుంది. ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా జతచేసిన ఆ సరికొత్త ఫీచర్ ఏమిటో ఒక లుక్కేయండి.
Instagram కొత్త ఫీచర్
ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఇమేజ్ లను యాడ్ చేసి పోస్ట్ చేస్తుంటారు చాలా మంది యూజర్లు. ఆఫ్ కోర్స్ అందరూ యాడ్ పోస్ట్ చేస్తుంటారు అనుకోండి. అయితే, పోస్ట్ చేసిన ఫోటోలలో ఏదైనా ఫోటో నచ్చక పొతే వాటిని ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండు అని చాలా సార్లు అనుకోని ఉండవచ్చు. ఇలా చింతించే వారి కోసమే ఇన్స్టాగ్రామ్ కొత్తగా ఎడిట్ ఆప్షన్ ను తీసుకు వచ్చింది. ఈ కొత్త ఆప్షన్ తో యూజర్లు పోస్ట్ చేసిన ఇమేజ్ లను ఎడిట్ చేసుకోవచ్చు.
అంటే, ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలకు ఎఫెక్ట్స్ మరియు ఫిల్టర్స్ ను జోడించవచ్చు. అంతేకాదు, ఆ పోస్ట్ క్యాప్షన్ లో మిస్టేక్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా సరిచేసుకునే అవకాశం ఉంటుంది. వాస్తవానికి, పోస్ట్ చేసిన ఫోటో లలో మరియు ఇతర వివరాలలో ఏవైనా తప్పులు దొర్లితే యూజర్లు వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించడానికి ఈ ఫీచర్ తెస్తోంది.
Also Read : డిసెంబర్ 1 నుండి New SIM Card Rules మొదలు..ఫాలో అవ్వకపోతే 10 లక్షలు ఫైన్.!
ఈ కొత్త ఫీచర్ ను ఎలా ఉపయోగించాలి?
ఈ కొత్త ఫీచర్ ను ఉపయోంచాలంటే ముందుగా ఇన్స్టాగ్రామ్ లోని మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి మీరు పోస్ట్ చేసిన పోస్ట్ ను సెలక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత పోస్ట్ కు కుడివైపు ఎగువ మూలలో వుండే మూడు చుక్కల గుర్తు (ఎలిప్సేస్) ను ఎంచుకోవాలి. తరువాత మీకు ఎంచుకున్న ఫోటో పైన ఎడిటింగ్ ఆప్షన్స్ మరియు టూల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఎడిట్ చేయదలిచిన వివరాలను ఎడిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు.