TikTok పోయే..Reels వచ్చే..గుడ్ న్యూస్ చెప్పిన Instagram

Updated on 09-Jul-2020
HIGHLIGHTS

ఇండో-చైనా సరిహద్దు ఘర్షణల తరువాత, దేశంలో టిక్‌టాక్ వంటి ప్రసిద్ధ 59 ప్రముఖ చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. .

ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ తన కొత్త ఫీచర్ 'రీల్స్'(REELS ) ను భారత్‌లో ప్రకటించింది.

మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సృష్టించిన వీడియోలను షేర్ చేయవచ్చు

ఇండో-చైనా సరిహద్దు ఘర్షణల తరువాత, దేశంలో 59 ప్రముఖ చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. టిక్‌టాక్ వంటి ప్రసిద్ధ యాప్స్ కూడా భారతదేశంలో నిషేధించబడ్డాయి. ఈ స్టేట్మెంట్ కారణంగా చాలా మంది వినియోగదారులు ప్రత్యామ్నాయాలు ఏవి అని వెతికిన విషయం అందరికీ తెలిసిన నిజం. ఇప్పుడు, దానిని దృష్టిలో పెట్టుకుని, షార్ట్ వీడియో ప్లాట్‌ఫాంలు చాలానే మార్కెట్‌కు వస్తున్నాయి.

ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ తన కొత్త ఫీచర్ 'రీల్స్'(REELS ) ను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. టిక్‌టాక్ మాదిరినే పనిచేసే ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఈ ఫీచర్ భారతదేశంలో ప్రారంభించబడింది. భారతదేశంలో ఇటీవల టిక్‌టాక్‌పై నిషేధం విధించినప్పటి నుండి భారతదేశంలో షార్ట్ వీడియో యాప్‌ల కోసం డిమాండ్ పెరిగడమే, ఈ చర్యకు కారణంగా ఊహించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఈ ఫీచర్ టిక్‌టాక్ యాప్ వలె పనిచేస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఈ ఫీచర్ ను మొట్టమొదట బ్రెజిల్‌లో పరీక్షించారు. ఇటీవల ఈ లక్షణాన్ని ఫ్రాన్స్ మరియు జర్మనీలలో కూడా విడుదల చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎలా పని చేస్తుంది?

రీల్స్ ఫీచర్ ఉపయోగించడానికి, వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ యాప్ కి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత, కెమెరాను తెరిచిన తరువాత, మీరు రీల్స్ యొక్క ఎంపికను చూస్తారు, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు 15 సెకన్ల చిన్న వీడియోను సృష్టించవచ్చు. మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సృష్టించిన వీడియోలను షేర్  చేయవచ్చు, అలాగే డైరెక్ట్ ఇన్‌బాక్స్‌లోని ఎవరికైనా మెసేజెస్ కూడా పంపవచ్చు.

సంగీతం , ఆన్‌లైన్, ఇన్‌స్టాగ్రామ్ లైబ్రరీ మరియు ఫోన్ లైబ్రరీ కోసం ఎంపిక ఉంటుంది. వీడియోలోని ఏదైనా ప్రత్యేకమైన భాగాన్ని నెమ్మది చేయడానికి లేదా వేగవంతం చేయడానికి వినియోగదారులకు అవకాశం ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన 45% వీడియోలు 15 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయం తీసుకుంటాయని ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ తెలిపారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :