యూజర్ల కోసం Instagram Good News అందించింది. ఇప్పటి వరకూ ఇన్స్టాగ్రామ్ లో Reels ను డౌన్ లోడ్ చేసుకోవడానికి టార్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తున్న వారికి ఇకనుండి ఆ అవసరం ఉండదు. ఇకనుండి రీల్స్ ను యాప్ నుండి డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఇన్స్టాగ్రామ్ తీసుకు వచ్చింది. దీనికోసం కొత్త డౌన్ లోడ్ ట్యాబ్ ను కొత్తగా లిస్ట్ లో చేర్చింది. అయితే, అన్ని వీడియోలను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉండదు సుమ. ఈ కొత్త అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.
ఇన్స్టాగ్రామ్ యొక్క CEO ఆడమ్ మోస్సేరి, తన అఫిషియల్ బ్రాడ్ క్యాస్ట్ ఛానల్ ద్వారా ఈ కొత్త అప్డేట్ ను అనౌన్స్ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ నుండి పోస్ట్ చేయబడిన రీల్స్ ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. వాస్తవానికి, ఈ ఫీచర్ US యూజర్స్ కోసం ముందుగా అందుబాటులోకి వచ్చింది. జూన్ నెలలోనే US యూజర్ల కోసం ఈ ఫీచర్ ను వాడుకలోకి తీసుకువచ్చారు. అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాపంగా ఉన్న అందరు యూజర్లకు కూడా అంధుబౌట్లోకి తీసుకు వచ్చారు.
కొత్త అప్డేట్ అందుకున్న యూజర్లు ఇన్స్టాగ్రామ్ లోని రీల్స్ లో పబ్లిక్ అకౌంట్స్ నుండి పోస్ట్ చేసిన వీడియోలను నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం, Share బటన్ పైన నొక్కాలి. ఇక్కడ కాపీ లింక్ పక్కనే డౌన్ లోడ్ బటన్ కనిపిస్తుంది. ఈ డౌన్ లోడ్ బటన్ పైన నొక్కడం ద్వారా ఆ వీడియోలను నేరుగా డౌన్ లోడ్స్ చేసుకోవచ్చు.
Also Read : Google Pay Users Alert: మీ ఫోన్ లో గూగుల్ పే ఉంటే ఈ యాప్స్ వాడొద్దు.!
ఆడమ్ మోస్సేరి ప్రకారం, పబ్లిక్ అకౌంట్స్ నుండి పోస్ట్ చేసిన వీడియోలను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుందని మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఈ డౌన్ లోడ్ రీల్స్ పైన అకౌంట్ యూజర్ పేరు మరియు దానికి ఆపాదించిన ఆడియో వివరాలతో వాటర్ మార్క్ యాడ్ చేయబడుతుంది.
ఒకవేళ మీరు పబ్లిక్ అకౌంట్ ను ఉపయోగిస్తూ, మీ రీల్స్ ను ఎవరు డౌన్ లోడ్ చెయ్యకూడదు అని మీరు అనుకుంటే, మీరు ఈ ఫీచర్ ను డిసేబుల్ చేయవచ్చు. అంటే, మీ రీల్స్ వీడియోలను ఇతరులు డౌన్ లోడ్ చేసే డౌన్ లోడ్ బటన్ ను తీసివేయవచ్చు.
దీనికోసం మీ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులోని Privacy లోకి వెళ్ళి అందులోని రీల్స్ మరియు రీమిక్స్ లోకి వెళ్ళి Download కోసం అందరిని అనుమతించే టోగుల్ ను off చేస్తే సరిపోతుంది.