Instagram Reels లో కొత్త ఉపయోగకరమైన ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసే యూజర్లు, వారికి నచ్చిన వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడానికి తర్డ్ పార్టీ పైనే ఆధార పడేవారు. అయితే, ఇప్పుడు సమస్యకు చెక్ పెట్టేందుకు ఇన్స్టాగ్రామ్ లో కొత్త డౌన్ లోడ్ ఫీచర్ ను తీసుకు వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ డౌన్ లోడ్ ఫీచర్ తో యూజర్లు వీడియోలను ఎటువంటి తర్డ్ పార్టీ అవకాశం లేకుండానే నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా వచ్చిన ఈ డౌన్ లోడ్ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందామా.
ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ను డౌన్ లోడ్ చేయడం కోసం ఇప్పటి వరకూ తర్డ్ పార్టీ ఉపయోగిస్తే మీకోసం ఈ గుడ్ న్యూస్. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు రీల్స్ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడానికి కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. ఈ కొత్త ఫీచర్ రీల్స్ షేర్ బటన్ లో అందించింది. ఈ ఆప్షన్ తో రీల్స్ వీడియోలను సింగల్ క్లిక్ తో డౌన లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ ను పబ్లిక్ అకౌంట్స్ నుండి షేర్ చేసిన వీడియోలను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం వుంది.
Also Read : TECNO Pova 5 Pro 5G స్మార్ట్ ఫోన్ పైన Amazon ధమాకా ఆఫర్.!
ఈ ఫీచర్ ముందుగా అమెరికా లోని యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చిన ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు భారత్ లోని యూజర్లకు కూడా అందించింది. ఈ కొత్త ఫీచర్ ను రీల్స్ వీడియో షేర్ బటన్ లోని Copy లింక్ బటన్ ప్రక్కనే అందించింది. ఈ ఫీచర్ ను జత చేసిన వీడియోలను మీరు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ పబ్లిక్ అకౌంట్ యూజర్ వారి రీల్స్ ను ఇతరులు డౌన్ లోడ్ చేయకుండగా చేసుకునే వీలు కూడా వుంది. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రైవసీ లోని download టూల్ ను ఆఫ్ చేస్తే సరిపుతుంది.
పబ్లిక్ అకౌంట్ నుండి షేర్ చేసిన రీల్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోల పైన యూజర్ పేరు మరియు ఆడియో వివరాలు కూడా వాటర్ మార్క్ ఉంటుంది.