ఇండియాలో TikTok ఇక లేనట్టేనా..

ఇండియాలో TikTok ఇక లేనట్టేనా..
HIGHLIGHTS

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనా నుండి ఆవిర్భవించిన లేదా సంబంధాలున్న China Mobile Apps జాబితాను విడుదల చేశాయి.

భారతదేశంలో, Android మరియు iOS యాప్స్ వినియోగం సెక్యూరిటీ మరియు ప్రైవసి సమస్యలను ఏజెన్సీలు ఉదహరించాయి.

ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జారీ చేసిన జాబితా పైన చర్చలు కొనసాగుతున్నాయని ఒక ప్రభుత్వ అధికారి కూడా నివేదికలో పేర్కొన్నారు.

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనా నుండి ఆవిర్భవించిన లేదా సంబంధాలున్న China Mobile Apps జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితాలోని మొత్తం 52 యాప్స్ ని వాడకుండా చూసేలా సలహా ఇవ్వమని భారత ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశంలో, Android మరియు iOS యాప్స్ వినియోగం సెక్యూరిటీ మరియు ప్రైవసి సమస్యలను ఏజెన్సీలు ఉదహరించాయి.

హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, “అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తులను” ఉదహరిస్తూ, చైనాతో సంభంధం ఉన్న ఈ Apps ‘భారతదేశ భద్రతకు హానికరం’ అని జాతీయ భద్రతా మండలి సచివాలయం భావిస్తున్నాయి.

ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జారీ చేసిన జాబితా పైన చర్చలు కొనసాగుతున్నాయని ఒక ప్రభుత్వ అధికారి కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇక అధికారిక నిర్ణయం అతి త్వరలో ప్రకటించవచ్చని కూడా సూచనప్రాయంగా తెలుస్తోంది. ఈ జాబితాలో TikTok, SHAREit, Club Factory వంటి అనేక ప్రసిద్ధ యాప్స్ పేర్లు ఉన్నాయి.  ఇవి భారతదేశంలో సోషల్ మరియు ఇ-కామర్స్ వ్యాపారాన్ని నడిపిస్తాయి. జాబితా నుండి ఇతర యాప్స్ విషయానికి వస్తే, Clash of Kings, Beauty Plus వంటి ఫోటోగ్రఫీ యాప్స్ మరియు ఇంకా చాలానే ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo