గత నెలలో, భారతీయులకి సంబంధించిన డేటాని చైనాకి చేరవేస్తునట్లుగా అనుమానమున్న, 59 ప్రముఖ యాప్స్ ని భారత ప్రభుత్వం నిషేధించి సంచలనం సృష్టించింది. అంతేకాదు, కేవలం అక్కడితో ఆగకుండా కొనసాగింపుగా మరో 47 Chinese Apps ను కూడా, ఇండియా నిషేధించింది. ముఖ్యంగా, ఈ యాప్స్ గత నెలలో భారతదేశంలో నిషేధించబడిన యాప్స్ కంపెనీలకు చెందినవి కావడం విశేషం.
ఈ 47 క్లోన్ యాప్స్ లో TikTok Lite, Helo Lite, Shareit Lite, Bigo Live Lite, మరియు YFV Lite వంటి యాప్స్ ఉన్నాయి. అయినప్పటికీ వాటి పూర్తి జాబితా గురించి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు కాని త్వరలో వెల్లడి అవుతుందని అనుకుంటున్నారు. ఈ సమాచారం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రతిఒక్కరూ కూడా ఇండియాలో చైనీస్ యాప్స్ నిషదం ఇక్కడితో ఆగుతుందా? లేక ఇంకా కొనసాగుతుందా? అనే ఆలోచనలో పడ్డారు
అంతేకాదు, Xiaomi యొక్క Zili, AliExpress మరియు ByteDance యొక్క Resso App కూడా చేర్చబడిందని కొని నివేదికలలో పేర్కొన్నారు. ఈ లిస్టులో PUBG ని కూడా చేర్చనున్నారని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే, మునుపటి మాదిరిగా నిషేధించిన యాప్స్ కంప్లీట్ లిస్ట్ మాత్రం ఇంకా ప్రకటించ లేదు.
ఇక గత నెలలో ఇండియాలో నిషేధించబడ్డ యాప్స్ విషయానికి వస్తే, ఈ యాప్స్ దేశం నుండి భారతీయుల డేటాను పెద్ద ఎత్తున చేరవేస్తునట్లు, చైనీస్ డెవలపర్లు లేదా చైనీస్ లింక్‌లతో అభివృద్ధి చేసిన ఈ యాప్స్ స్పైవేర్ లేదా ఇతర హానికరమైన వస్తువులుగా ఉపయోగించవచ్చని సూచించబడింది. ఈ అభ్యర్ధనల తరువాత భారత ప్రభుత్వం అనూహ్యంగా ఈరోజు ఈ 59 చైనా యాప్స్ ని నిషేదిస్తునట్లు ప్రకటించింది.
ఇండియాలో నిషేధించబడ్డ 59 Chinese Mobile Apps యొక్క కంప్లీట్ లిస్ట్ ఈ క్రింద చూడవచ్చు.