ఈ మొబైల్ కీ బోర్డు App మీ ఫోనులో ఉంటే ఇక మీ అకౌంటులో డబ్బంతా హరించుకుపోతుంది
చాలా సులభంగా వాడుకోగల మొబైల్ కీ బోర్డుగా చెప్పుకుంటోంది.
Google తన Play Store, అనేకమైన మాల్వేర్ Apps ను తొలిగించింది. వాస్తవానికి, గూగుల్ తన దృష్టికి వచ్చిన మాల్వేర్ యాప్స్ ను మాత్రం వెనువెంటనే తొలిగిస్తుంది. కానీ, ఒకటి తొలగిస్తే మరొకటి పుట్టుకురావడం సర్వసాధారణం అయిపొయింది. కానీ,గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తొలగించిన Apps ను కొంతమంది వినియోగదారుల ఇంకా తమ స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్నారు. ఇటువంటిదే ఒక ఆప్ మీ డబ్బు దోచుకునే అవకాశం ఉన్నట్లు బయటపడింది. అదేమిటంటే, ai.type keyboard అనే రుతో ఉంటుంది మరియు చాలా సులభంగా వాడుకోగల మొబైల్ కీ బోర్డుగా చెప్పుకుంటోంది.
ఈ విషయాన్ని Zee Business తెలిపింది. దీనిప్రకారం, మొబైల్ టెక్నాలజీ సంస్థ అప్ స్ట్రీమ్, ai.type keyboard అనే తన వినియోగదారులను దోచుకుంటున్నట్లుగా చెబుతునట్లు తెలుస్తోంది. ఈ పరిశోధకులు చెబుతున్న ప్రకారం, ఈ యాప్ దీన్ని ఉపయోగిస్తున్న వినియోగదారులు ప్రీమియం థర్డ్ పార్టీ యాప్స్ ని ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే సబ్స్క్రైబ్ చేసుతున్నట్లు కనుగొన్నారు. అంటే, మీకు తెలియకుండానే అటువంటి ప్రీమియం యాప్స్ కి డబ్బును చెల్లిస్తుంది, అంటే దోచుకుంటున్నది.
వాస్తవానికి, దీని పైన ఎన్నో కంప్లైంట్స్ రావడంతో, 2019 జూన్ నెలలో దీన్ని ప్లే స్టోర్ నుండి తొలగించారు. అయితే, అనేకరకాలైన థర్డ్ పార్టీ సోర్స్ ల ద్వారా ఇది ఇప్పటికి అందుబాటులో వుంది మరియు ఇంకా చాలా మొబైల్ ఫోన్లలో మనుగడ సాగిస్తోంది. ఇది మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్ ద్వారా మనకు నష్టం కలిగిస్తుంది.