4 స్టెప్స్ లో ఆన్లైన్ ఆధార్ కనెక్షన్ మరియు అప్డేట్ చేయండి ?

Updated on 21-Mar-2018

2009 లో ఆధార్ కార్డు సిస్టం ను యుఐడిఎఐ ప్రవేశపెట్టింది, అందుచే ఆధార్ కార్డు భారతదేశంలోని ప్రతి పౌరుడికి గుర్తింపుగా మారింది. ఇది బ్యాంకులో లేదా ఆసుపత్రిలో ఉన్న ప్రతిచోటా ఉపయోగించబడుతుంది . మనం ఆధార్ కార్డ్ లో కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి అంటే  దానిలో కొంత సమాచారం సరికానిదిగా లేదా మీ ఆధార్ కార్డులో మీ పేరు (అక్షరక్రమం) తప్పు కావచ్చు లేదా మీ చిరునామా లేదా ఫోన్ నంబర్ మారినట్లు కావచ్చు.

మీరు ఆధార్ కార్డును సరిచేసుకోవడానికి కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు . ఆధార్ కార్డును సరిచేయడానికి, మీరు దాని వెబ్ పోర్టల్ కి  వెళ్లి మీ ఆధార్ కార్డుని అప్డేట్ చేయవచ్చు .

  • స్టెప్ 1: uidai యొక్క  https://ssup.uidai.gov.in వెబ్సైట్ కి వెళ్ళండి . ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ను నమోదు చేయండి. అప్పుడు captcha వేయండి . OTP (వన్ టైమ్ పాస్వర్డ్) యొక్కనెంబర్ ను నమోదు చేయండి, ఇలా  చేస్తే వెబ్సైట్ కి  లాగిన్ అవుతుంది.
  • స్టెప్  2: మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, వయస్సు, లింగ సమాచారం, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా మొదలైన వాటికి సంబంధించిన ఫీల్డ్స్ ఉంటుంది. ఇంగ్లిష్ లో మరియు మీ లోకల్ భాషలో ఆధార్ కార్డును సరిచేయటానికి కి మీరు అభ్యర్థనను సమర్పించాలి. మీరు క్రొత్త సమాచారాన్ని నింపి దాన్ని సమర్పించండి.
  • స్టెప్  3: డేటా అప్డేట్  తర్వాత, ప్రాసెస్ క్లిక్ చేయండి. మీ కొత్త సమాచారాన్ని మీ అన్ని పత్రాలను అప్లోడ్ చేయండి. అప్పుడు కన్ఫర్మ్ పై  క్లిక్ చేయండి. దీని తరువాత, ఎజిస్ మరియు కార్విస్ మీద క్లిక్ చేసి దానిని సబ్మిట్ చేయండి.
  • స్టెప్  4 : చివరికి, ఆధార్ నంబర్ మరియు URN నెంబర్ ను ఎంటర్ చేసి లాగ్ అవుట్ చేయండి. అప్పుడు డేటా అప్డేట్ ఆప్షన్ వెళ్లి, మీ ఆధార్  నంబరు మరియు URN నంబర్ ని చెక్  చేయండి. మీ మొబైల్ కి అప్డేట్ మెసేజ్  పంపబడుతుంది.
  • UIDAI వెబ్సైట్ లో  మీ అన్ని డాక్యుమెంట్లు 90 రోజులలో అప్డేట్ అవుతాయని తెలుస్తుంది. ఈ సమాచారం మీ మొబైల్ నంబర్ కి  ఇవ్వబడుతుంది. మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసిన  తరువాత, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

Connect On :