Whatsapp గుడ్ న్యూస్: ఇక పర్సనల్ చాట్స్ కి తాళం..కొత్త ఫీచర్ అదిరిందిగా.!
వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను రోల్ అవుట్ చేసింది
మీ వాట్సాప్ పర్సనల్ చాట్ చూసే అవకాశమే ఉండదు
మీ వాట్సాప్ చాటింగ్ ఇంకెవరైనా చూస్తారు అనే డౌట్ లేకుండా ఉండదు
వాట్సాప్ యూజర్ల కోసం మరొక కొత్త మరియు చాలా ఉపయోగకరమైన ఫీచర్ ను కొత్తగా రోల్ అవుట్ చేసింది. ఈ కొత్త ఫీచర్ తో మీ వాట్సాప్ చాటింగ్ ఇంకెవరైనా చూస్తారు అనే డౌట్ లేకుండా నిశ్చింతగా ఉండవచ్చు. మీ ఫోన్ ను మీకు ఇష్టమైన లేదా ఫ్యామిలీకి ఇచ్చిన సరే మీ వాట్సాప్ పర్సనల్ చాట్ చూసే అవకాశమే ఉండదు. మీ వాట్సాప్ కి లాక్ లేకున్నా నో టెన్షన్. ఈ కొత్త ఫీచర్ వివరాలేమిటో జర చూద్దాం పదండి.
వాట్సాప్ లేటెస్ట్ గా Chat Lock ఫీచర్ ను రోల్ అవుట్ చేసింది. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసిన యూజర్లు వారి పర్సనల్ చాట్ లను సీక్రెట్ గా దాచుకోవచ్చు. అంతేకాదు, లాక్ చేసిన కంటాక్స్ నుండి వచ్చే చాట్స్ ఇతరులకు కనిపించకుండా ఒక ఫోల్డర్ లో లాక్ చేయ బడతాయి. ఈ ఈ ఫోల్డర్ ను తెరవాలంటే పాస్వర్డ్ అవసరం అవుతుంది. ఈ పాస్వర్డ్ ను మీరు సెట్ చేసుకోవచ్చు మరియు మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ లేదా PIN లాక్ వంటి వాటిని ఈ ఫోల్డర్ కి పాస్వర్డ్ గా ఉపయోగించే వీలుంది.
ఈ కొత్త ఫీచర్ తో ఉపయోగం ఏమిటి?
వాట్సాప్ కొత్త ఫీచర్ Whatsap Chat Lock ఉపయోగం ఏమిటి అని అనుకుంటున్నారా? మీరు మీ ఫోన్ మీ ఫ్యామిలీ లేదా ఇష్టమైన వారు లేదా ఫ్రెండ్ కి ఇచ్చినప్పుడు వారు మీ పర్సనల్ చాట్ లను చేసే వీలు లేకుండా చేస్తుంది ఈ కొత్త ఫీచర్. మీరు కోరుకున్న కాంటాక్ట్ లను ఈ వాట్సాప్ చాట్ లాక్ తో లాక్ చేయవచ్చు.
Whatsap Chat Lock ని ఫోన్ లో ఎలా సెట్ చెయ్యాలి?
మీ ఫోన్ లో ఈ Whatsap Chat Lock ని సెట్ చేసుకోవడం చాలా సింపుల్ మీ వాట్సాప్ లోని కాంటాక్ట్ పైన క్లిక్ చేస్తే కొత్త ఈ అప్షన్ Chat Lock కనిపిస్తుంది, ఇక్కడ టోగుల్ పైన నొక్కడం ద్వారా దీన్ని మీ ఫోన్ లో ఎనేబుల్ చెయ్యవచ్చు.