ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లేదా EPF అనేది ఒక వ్యక్తి జీతం నుండి తప్పనిసరిగా ఆదా చేసుకోవాల్సిన సహకారం. ఒక సంస్థ 20 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంటే, అక్కడ ప్రతి ఉద్యోగి జీతంలో తగ్గింపు ఉంటుంది. కొన్ని పరిస్థితులలో ఉద్యోగస్తులు తమ PF మొత్తం నుండి కొంత భాగాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకోవచ్చు. PF అడ్వాన్స్ కోసం అభ్యర్ధన చేసిన తరువాత, అది ఆమోదం కోసం కంపెనీకి పంపబడుతుంది.
అయితే, ఎంప్లాయీస్ Unified Mobile Application UMANG యాప్ ద్వారా EPF క్లెయిమ్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు.
UMANG యాప్ అనేక ప్రభుత్వ సేవలకు నెలవైన యాప్. దీని ద్వారా చందాదారులు EPF బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. ఎస్టాబ్లిష్మెంట్ కోసం సెర్చ్ చెయ్యవచ్చు. EPFO చిరునామాను పొందవచ్చు మరియు జీవిత ధృవీకరణ పత్రం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్లే స్టోర్ నుండి UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ ని తెరిచి మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
'EPFO' పై క్లిక్ చేయండి EPFO అనేది EPF సహకారాన్ని అమలు చేసే రిటైర్మెంట్ ఫండ్ బాడీ.
తదుపరి పేజీలో మీరు ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీస్, జనరల్ సర్వీస్, ఎంప్లాయర్-కెంట్రిక్ సర్వీస్, ఇ-కెవైసి సర్వీస్, జీవన్ ప్రమాన్ చూడవచ్చు. ఈ ఎంపికల నుండి సాధారణ సేవలను ఎంచుకోండి.
ఈ క్రొత్త పేజీలో, వ్యూ పాస్‌బుక్, రైజ్ క్లెయిమ్ మరియు ట్రాక్ క్లెయిమ్ కోసం ఎంపికలు అందుబాటులో ఉంటాయి. మీరు 'Know Your Claim Status' పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీ 12 అంకెల యూనివర్సల్ ఖాతా సంఖ్య UAN ను నమోదు చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి.
ఇప్పుడు క్లెయిమ్ ఐడిపై క్లిక్ చేయండి. మీ క్లెయిమ్ సమాచారం తెరపై కనిపిస్తుంది.