WhatsApp Channels: కొత్త కొత్త అప్డేట్స్ మరియు ఫీచర్స్ తో మరింత ముందుకు దూసుకుపోతున్న WhatsApp కొత్తగా Channels ఫీచర్స్ ను పరిచయం చేసింది. ఈ కొత్త WhatsApp Channels ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు వారికి నచ్చిన సెలెబ్రేటిస్ లేదా ఆర్గనైజేషన్ లేదా ఛానెల్ కు నేరుగా జాయిన్ కావచ్చు. తద్వారా, యూజర్లు ఆ ఛానెల్ లేదా సెలెబ్రేటిస్ యొక్క అప్డేట్స్ ను నేరుగా వాట్సప్ లో అందుకోవచ్చు. కొత్త వాట్సాప్ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ ను అందుకున్న ప్రతీఒక్కరూ కూడా ఈ ఫీచర్ ను ఎంజాయ్ చేయవచ్చు. వాట్సాప్ కొత్తగా తీసుకువచ్చిన ఈ కొత్త వాట్సాప్ ఛానెల్స్ ఫీచర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
సబ్ స్క్రైబర్ లకు కొత్త అప్డేట్స్ ను చాలా వేగంగా మరియు ఇన్స్టాంట్ గా అందించే డైరెక్ట్ మార్గంగా ఈ WhatsApp channel చెప్పబడుతుంది. క్రియేటర్స్ వారి ఛానెల్ సబ్ స్క్రైబర్స్ అందరికీ ఈ వాట్సాప్ చానెల్ ద్వారా ఒక్క మెసేజ్ తో అప్డేట్ ను సెండ్ చేసే వీలుంటుంది.
Also Read : ధమాకా అఫర్: 10 వేలకే QLED స్మార్ట్ TV స్మార్ట్ టీవీ అందుకోండి.!
ప్రస్తుతానికి వాట్సాప్ లో సెలెబ్రేటిస్, పెద్ద బ్రాండ్స్ మరియు న్యూస్ ఛానెల్స్ కోసం ఈ WhatsApp channel అందుబాటులో వుంది మరియు త్వరలోనే అందరికి వారి ఛానెల్ క్రియేట్ చేసుకునే అవకాశం అందుతుందని, Whatsapp తెలిపింది.
మీ వాట్సాప్ అకౌంట్ లో WhatsApp channel ట్యాబ్ కోసం మీరు Chats కి పక్కనే ఉండే 'Updates' (గతంలో Status) అడుగున ఈ Channls ట్యాబ్ ను మీరు చూడవచ్చు. ఇక్కడ '+' గుర్తు లేదా Find Channel ను ఎంచుకోవడం ద్వారా మీరు మీకు నచ్చిన లేదా మీకు ఇష్టమైన చానెల్ ను సెర్చ్ చేసి జాయిన్ అయ్యే అవకాశం వుంది.
ప్రస్తుతానికి కేవలం సెలెబ్రేటిస్ మరియు ఫెమస్ పీపుల్స్ కోసం మాత్రమే ఈ create WhatsApp channel అప్షన్ అందుబాటులో వుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. మీ అకౌంట్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఈ క్రింద స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీ ఛానెల్ క్రియేట్ చేసుకోవచ్చు.
దీనికోసం, మీ వాట్సాప్ లోని Channel menu లోకి వెళ్లి పైన ఉన్న '+' గుర్తు ను ఎంచుకోవాలి. ఇక్కడ మీకు 'New Channel' అని అప్షన్ వస్తుంది మరియు దీనిపైన నొక్కగానే 'Get Started' అని కనిపిస్తుంది. ఇక్కడ అందించిన ఇన్స్ట్రక్షన్ లను ఫాలో అవ్వడం ద్వారా మీ వాట్సాప్ ఛానెల్ ను క్రియేట్ చేసుకోవచ్చు.